డైమండ్ పాప వ్యాఖ్యలపై మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్

డైమండ్ పాప వ్యాఖ్యలపై మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ లీడర్ నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్ర. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాదయాత్ర తొలినాళ్లల్లో మంత్రి రోజాపై నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డైమండ్ పాప అని సంబోధించారు.  మహిళలకు “డైమండ్ పాప” క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ చురకలు అంటించారు. తనకు చీర, గాజులు పంపిస్తానని మహిళలను అగౌరవపరిచేలా రోజా మాట్లాడారని చీర, గాజులు పంపాలని ఆ డైమండ్‌ పాపకు చెప్పానని నారా లోకేశ్ గుర్తు చేశారు. కాగా ఆ కామెంట్స్ పై ఇప్పడు  మంత్రి రోజా స్పందించారు. డైమండ్ పాప అన్న లోకేశ్ ను లోకేశ్ అంకుల్ అని సెటైర్ వేశారు మంత్రి రోజా.  యువగళం పాదయాత్ర చేస్తున్న పప్పునాయుడు తండ్రి రాష్ట్రానికి ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో చెప్పకుండానే నడుస్తున్నాడని విమర్శించారు. తండ్రి సీఎం గా ఉండగా మొత్తం  దోచుకొని హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా  మళ్లి తన తండ్రిని మళ్ళీ సీఎం పీఠం ఎక్కించేందుకు లోకేశ్ అంకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక వైపు తన తండ్రి చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై ముఖ్యమంత్రి జగన్ ను వేధించినా. మన వై.యస్  జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం  ఆత్మస్ధైర్యంతో పాదయాత్ర చేసి పేదల కష్టాలను వింటూ అధికారంలో వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి వై.యస్  జగన్ మోహన్ రెడ్డి గారు.  పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు విన్నారు. అధికారంలోకి వచ్చాక వారి కష్టాలు తీరుస్తున్నారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు లోకేశ్ అంకుల్  అవసరం వచ్చినప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుని, వారి చేతికి అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారు. కానీ ఆ విషయం నందమూరి కుటుంబం  గుర్తించలేక పోతున్నారు. లోకేష్ వెనుక  సెక్యూరిటీ, వాలంటీర్లు లేక పోతే 10 మంది కూడా లోకేశ్ పాదయాత్రలో ఉండరు. లోకేశ్ అంకుల్  ది యువగళం కాదు. ఒంటరి గళం అనే చెప్పాలి అసలు.  లీడర్ గా లోకేష్ 100 శాతం ఫెయిల్యూర్. ఇది మంగళగిర ప్రజలు గుర్తించే ఓడించారు. తండ్రి సీఎంగా, లోకేశ్ మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేని రికార్డు సొంతం చేసుకున్నారు అని ఎద్దేవ చేశారు మంత్రి రోజా గారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh