పెరుగుతున్న కరొన కేసులు అలర్ట్ అయిన ఏపీ వైద్యశాఖ

CORONA VIRUS:పెరుగుతున్న కరొన కేసులు అలర్ట్ అయిన ఏపీ వైద్యశాఖ

 కరోనా మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ అప్రమత్తమైంది. విజయవాడ ప్రభుత్వసుపత్రిలో అధికారులు కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ మాక్ డ్రిల్‌లో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, డిఎంఅండ్ హెచ్ఒ సుహాసిని, ప్రభుత్వసుపత్రి సూపరిండెంట్ సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్‌తో ఎటువంటి ప్రమాదకర లక్షణాలు లేవన్నారు. ఫోర్త్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. డాక్టర్లు, మందులు వంటివి కోరత లేకుండా అన్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. 951 బెడ్లు సిద్దం చేశామని, ఇప్పటికే 6 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

అలాగే దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 5 వేల 880 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో భారత్ లో మెుత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటింది. మహమ్మారి సోకి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే  523 కరోనా కేసులు పెరిగాయి.  దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో నలుగురు, కేరళలో ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు  చొప్పున కరోనాతో మృతి చెందారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అన్నీ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశంలో ఇప్పటి వరకు 220.66 కోట్ల మందికి టీకా డోసులు పంపిణీ చేశారు.

మరోవైపు, కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఆస్పత్రుల్లోని సౌకర్యాలపై ఇవాళ, రేపు మాక్‌ డ్రిల్‌ చేయనున్నారు. ఈ డ్రిల్ లో వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల సంఖ్య, పడకల సామర్థ్యం, ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్‌ వివరాలను సేకరించనున్నారు. అంతేకాకుండా కోవిడ్ప రీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు (ఎన్‌-95) సంఖయ్ వంటి అంశాలను గుర్తించనున్నారు. తాజాగా హర్యానాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో జరిగిన మాక్‌ డ్రిల్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh