అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం

taraka ratna health update

అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం

నటుడు, నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆయనకు బ్రెయిన్‌ స్కాన్‌ చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. గత 22 రోజులుగా నారాయణ హృదయాలయలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తారకరత్న పరిస్థితి తెలిసిన వెంటనే నందమూరి కుటుంబసభ్యుల తో పాటు బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఏ సమయంలోనైనా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేసే అవకాశం ఉంది.

జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర లో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌ తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ
హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే నందమూరి బాల కృష్ణ ప్రత్యేక పూజలు చేపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh