Godavari: గోదావరి జిల్లాల్లో భానుడి భగభగలు

Godavari

Godavari: గోదావరి జిల్లాల్లో భానుడి భగభగలు

Godavari: వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఎండలు, వడగాల్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదై ఠారెత్తిస్తున్నాయి.

వేసవి పీక్స్‌కు చేరే మే నెలలో సూర్యుడు భగభగమండుతున్నాడు. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలపై ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎండలు భారీగా పెరిగిపోయాయి.

అటు వడగాల్పుల తీవ్రత అధికమైంది. కోస్తా ప్రాంతంలో గత 3 రోజుల్నించి ఎండల తీవ్రత ఎక్కువైంది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమంటున్నాయి.

రాత్రి 7-8 గంటల వరకూ వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగింది.

Also Watch

River Krishna: కృష్ణా జలాల పంచాయతీ – రంగంలోకి కేంద్రం

అయితే రాజమండ్రిలో 49 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వృద్దులు, పిల్లలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బ తగిలి కొంతమంది నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక. బయటకు రాలేక సతమతమవుతున్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు అత్యధికంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు.

మధ్యాహ్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 131 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి.

అత్యధికంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, కృష్ణా జిల్లా కోడూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొన్నూరులో 45.9, ఆగిరిపల్లెలో 45.7, గోపాలపురంలో 45.4, గుంటూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అనేకచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

విశాఖపట్నం జిల్లాలో  కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తకోటలో 40.23, నాతవరం 40.22, మునగపాక 40.17, కశింకోట 40.14, బలిఘట్టం 40.12, మాడుగుల 40.05, గంభీరం 40.01 డిగ్రీలు.. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు 43, రాజాం 42, పాలకొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నెల్లూరు జిల్లాలో గరిష్టంగా 37.5 డిగ్రీలు, ప్రకాశంలో 36, తిరుపతిలో 41, చిత్తూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అయితే వాస్తవానికి రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు.  అయితే ఇప్పుడే ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన ఎక్కువవుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh