River Krishna: కృష్ణా జలాల పంచాయతీ – రంగంలోకి కేంద్రం

River Krishna

River Krishna: కృష్ణా జలాల పంచాయతీ – రంగంలోకి కేంద్రం

River Krishna: కృష్ణాలో నీటి కేటా యింపులు లేకుండానే అప్పర్‌ భద్ర వంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కర్ణాటక 75 శాతం నీటి వాటాను తెరమీదకు తీసుకువస్తోంది. ఈ నెపంతో నికర జలాల పేరుతో వరద జలాలను కృష్ణా ఎగువన తమ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు లకు తరలించేందుకు వ్యూహం పన్నుతోంది.

దీనిలో భాగంగానే కృష్ణా నికర జలాల్లో 75 శాతం నీటిని వాడుకునేలా బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ (కృష్ణా నదీ వివాదాల ట్రిబ్యునల్‌ ఉ కెడబ్ల్యుడిటి-2) 2103లో ఇచ్చిన తీర్పును నోటిఫై చేయాల్సిందిగా పట్టు-బడుతోంది. దీనిపై సుప్రీంకోర్డును కూడా ఆశ్రయించింది.

కర్ణాటక డిమాండ్‌ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పట్లోనే వ్యతిరేకించగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా సుప్రీంకోర్టులో వాదనలు సాగాయి.

తెలంగాణ కూడా సుప్రీంలో కౌంటర్‌ దాఖలు చేసింది. కృష్ణా జలాల కేటాయిం పుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తాము తీవ్రంగా నష్టపోయామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

కృష్ణా జలాల్లో భాగస్వామ్య రాష్ట్రమై న మహారాష్ట్ర మాత్రం కర్ణాటకకు సానుకూలంగా ఉంది. కృష్ణా జలాలను 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్ణాటక, మహారాష్ట్రలు వినియోగిం చుకోవచ్చని బచావత్‌ -టైబ్యునల్‌ చెప్పింది.

దీంతో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ను నోటిఫై చేస్తే అధికంగా నీటిని వినియోగించుకునే రాష్ట్రాల్లో కర్ణాటకతో పాటు- తాము కూడా ఉంటామని మహారాష్ట్ర భావిస్తోంది.

ఈ నేపథ్యంలో కొత్త -టైబ్యునల్‌ ఏర్పడేలోపే పాత ట్రిబ్యునల్‌ను నోటిఫై చేయాలని కర్ణాటక డిమాండ్‌ చేస్తోంది. కర్ణాటక వాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకి స్తున్నాయి.

ఈ మేరకు సుప్రీం కోర్టుకు సైతం తమ వాదనలు వినిపించాయి. బ్రిజేష్‌ కుమార్‌ -టైబ్యున ల్‌ను నోటిఫై చేయకపోవటం వల్ల కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోతున్నామని కర్ణాటక వాదించ టంలో అర్ధం లేదు.

Also Watch

KTR America Tour: నేడు అమెరికాకు మంత్రి కేటీఆర్

ఎగువ నుంచి వస్తున్న వరద జలాలకు అడ్డుకట్టలు నిర్మించి కృష్ణా జలాలతో తమ ప్రాజెక్టులన్నీ నింపుకుని తమకు ఎక్కువైన వరద జలాలనే దిగువ రాష్ట్రాలకు పంపిస్తున్నారు.

చట్టవిరుద్దంగా, అనుమతుల్లేకుండా కర్ణాటక నిర్మించిన అనేక ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలు, వాటి తాలూకు విచారణలు కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త వాదనలు తెరమీదకు తీసుకువచ్చి 75 శాతం నీటిని అధికారికంగా వాడుకునేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందనీ.

కృష్ణా జలాల పంచాయతీ

అదే అమలైతే వరద నీటి ప్రవాహం లేని సమయాల్లో ఏపీ, తెలంగాణలు ఎడారులుగా మారే ప్రమాదముందని జలవనరుల నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

2011లోనే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులను గుర్తించినందున వాటికి కేటాయించిన జలాలకు చట్టబద్దత లేదని అంటు-న్నారు.

కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ కన్నా తామెక్కువ నష్టపోయామని తెలంగాణ వాదిస్తోంది. అందువల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేటాయించిన నీటిలో 50:50 దామాషా ప్రకారం నీటి వాటాలను పున:పంపిణీ చేయాలనీ, దీని కోసం కొత్త -టైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

ఈ డిమాండ్‌ అమలుకు సాంకేతికంగా చిక్కుగా ఉన్న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులను కూడా తెలంగాణ విత్‌ డ్రా చేసుకుంది.

కర్ణాటక వాదనే నెగ్గినా కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పడినా కృష్ణా జలాల పున:పంపిణీ, వాటి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వాడకం సమస్యలు మళ్లీ మొదలవుతాయి..

ఈ నేపథ్యంలో కృష్ణా జలాల భాగస్వామ్య రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం అనుసరించే నూతన విధానం కర్ణాటక వాదనకు బలం చేకూరుస్తుందా, అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తుందా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh