ఎన్టీఆర్ పై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

NTR :ఎన్టీఆర్ పై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో నట సింహా నందమూరి బాలకృష్ణ  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సభలో  పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ది చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు

తనకు జన్మనిచ్చి, అభిమానుల మనసులో చోటు కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని, సినీ రంగంలోనూ ఆయన నటన చిరస్థాయిగా నిలిచిపోయిందని నందమూరి బాలకృష్ణ కొనియాడారు . ఎన్టీఆర్ ఎవరి రుణాన్ని ఉంచుకోలేదని తనను ఆదరించిన ప్రజల కోసం తన వంతుగా ఎంతో చేశారని గుర్తు చేశారు.

నేను కూడా తన తండ్రి లా కులమతాలకు అతీతంగా పని చేశారని, తాను కూడా కులమతాలకు అతీతం అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. అన్న బాలయ్య చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీరు అందించారని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ తో పాటు నటించిన వారందరూ చిరస్మరణీయులే అని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల రోజే పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కావడం మరో విశేషం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో కలిసి నటించిన వారంతా గొప్పవారేనని పేర్కొన్న బాలకృష్ణ, కమర్షియల్ సినిమాలకు ఎన్టీఆర్ ఆద్యులు అంటూ తెలిపారుతన అభిమానులు అందరూ తన కుటుంబంలో భాగమేనని బాలకృష్ణ వెల్లడించారు.

అయితే తెనాలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ఎన్టీఆర్ పేరిట అవార్డులను బాలకృష్ణ అందించారు. ఎన్టీఆర్ అవార్డును అందుకోవడానికి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి రావడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బి నాగిరెడ్డి, సావిత్రి గార్లను కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. సావిత్రి గారు మహానటి అని నటన అంటే సావిత్రిలా ఉండాలని ఆమె నటన నేటికీ అజరామరంగా సజీవంగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిందని వెల్లడించారు.

అలాగే తెనాలి ప్రాంతం ఎంతో మంది ప్రముఖులు, కవులు, కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్న బాలకృష్ణ తెనాలి ప్రజలు సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. బి నాగిరెడ్డి గారు కూడా సినీ రంగంలో చాలా శ్రమించారని పేర్కొన్న ఆయన, ఇప్పటికీ వారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే అందుకు వారు చేసిన కృషి కారణమని పేర్కొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh