CM KCR : సంచలన నిర్ణయం..

CM KCR

CM KCR : సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో ట్విన్ టవర్స్

CM KCR :  తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచి ప్రతి నెలా వేల కోట్ల రెవెన్యూ వస్తోంది.

ఆ డబ్బును అటు పథకాలకు ఉపయోగిస్తూనే అందులో కొంత అభివృద్ధి కట్టడాల కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది.

అందులో భాగంగానే కొత్త సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి, ఫ్లైఓవర్లు ఇలా ఎన్నో వచ్చాయి.

తాజాగా ట్విన్ టవర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న సీఎం కేసీఆర్. ఈ నిర్మాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఆయా శాఖ‌ల అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సెక్రటేరియట్ కు సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు.

అలాగే కొత్త తెలంగాణ సచివాలయం ప్రారంభమైన నెల రోజులకే అన్ని శాఖల అధిపతుల కోసం సచివాలయం సమీపంలో

ట్విన్ టవర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. కొత్త సచివాలయం పూర్తిస్థాయిలో

అందుబాటులోకి రావడంతో అన్ని ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వోడీ) కార్యాలయాలను ఒకే CM KCR :  చోటకు

తీసుకురావడంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా

సచివాలయానికి సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు.

అయితే సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్  మరింత

మెరుగైన పరిపాలన అందించేందుకు ఏం చెయ్యాలనే అంశంపై చర్చించారు. సెక్రటేరియట్‌లో మంత్రులు, కార్యదర్శులకు తరచూ హెచ్ వోడీలతో పని ఉంటోంది. వారంతా ఒకే చోట ఉంటే పని త్వరగా అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే ప్లాన్ బాగానే ఉంది కానీ   టవర్ల నిర్మాణం కోసం స్థలం ఎక్కడ ఉంది అనేదే సవాలు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో విశాలమైనవి ఏవో సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.  స్థలం ఏది అనేది డిసైడ్ అయిన తర్వాత ట్విన్ టవర్లను నిర్మిస్తారని తెలిపారు.

కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. వీరికి లక్షరూపాయల CM KCR :  చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకు సంబంధించి   విధి విధానాలను మరోరెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సిఎం కేసీఆర్ కు వివరించారు. త్వరిత గతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని  సిఎం మంత్రి గంగులను  ఆదేశించారు.

సమీక్షా సమావేశం అనంతరం అమరుల స్మారకం వద్దకు సిఎం కేసీఆర్ చేరుకున్నారు.  అక్కడ  జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలివచారు సీఎం  కేసీఆర్.   అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh