YS Jagan : నేడు ఆణిముత్యాలు’కు అవార్డుల ప్రదానోత్సవం

YS Jagan : నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు అవార్డుల ప్రదానోత్సవం

YS Jagan :  రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్ధులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో సిఎం జగన్ పాల్గొంటారు.

అయితే  గత ప్రభుత్వంలో పెత్తందార్ల చేతిలో బందీ అయిన విద్యావ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. లక్షల్లో డబ్బు గుంజే కార్పొరేట్‌ స్కూళ్ల కన్నా మిన్నగా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించింది. ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చి, డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టి, మెరుగైన విద్యనందిస్తోంది.

ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్,YS Jagan :  ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక లీడర్‌ వంటి ఆణిముత్యాలు రావాలన్న తపన, తాపత్రయంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ..

రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ-కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు.

వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు’ను ప్రదానం చేయనున్నారు.

కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌లు పరిశీలించారు.

జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలు ఇలా..

పదవ తరగతి రాష్ట్రస్ధాయి నగదు పురస్కారం (రూ.) ప్రథమ 1.00.000, ద్వితీయ 75,000, తృతీయ బహుమతిగా రూ.50,000అందిస్తారు. మొత్తం 42 మంది విద్యార్ధులకు ఈ పురస్కారాలు దక్కాయి.

పదవ తరగతి జిల్లా స్ధాయి నగదు పురస్కారంగా ప్రథమ బహుమతి రూ. 50,000, ద్వితీయ బహుమతి రూ.30,000, తృతీయ బహుమతి రూ. 15,000 అందిస్తారు. మొత్తం 609 మంది విద్యార్ధులకు ఈ పురస్కారాలు అందిస్తారు.

పదవ తరగతి నియోజకవర్గ స్ధాయి నగదు పురస్కారాన్ని 681మందికి అందిస్తారు. ప్రథమ బహుమతిగా రూ. 15,000, ద్వితీయ బహుమతి రూ. 10,000, తృతీయ బహుమతి రూ.5,000గా అందిస్తారు.

పదవ తరగతి పాఠశాల స్ధాయి నగదు పురస్కారంగా ప్రథమ స్థాయిలో రూ. 3,000, ద్వితీయ బహుమతిగా రూ.2,000, తృతీయ బహుమతిగా రూ. 1,000 మొత్తం 20,299 మందికి పురస్కారాలు అందించారు.

ఇంటర్మీడియట్ రాష్ట్ర స్ధాయి గ్రూపుల వారీగా 26మంది టాపర్స్ కు లక్ష రుపాయల నగదు బహుమతి అందిస్తారు.

ఇంటర్మీడియట్ జిల్లా స్ధాయి గ్రూపుల వారీగా 391మంది టాపర్స్ కు రూ. 50,000 నగదు అందిస్తారు. ఇంటర్మీడియట్ నియోజకవర్గ స్ధాయిYS Jagan :  గ్రూపుల వారీగా టాపర్స్ ‌గా నిలిచిన 662మందికి రూ. 15,000 అందిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,710మంది విద్యార్ధులకు జగనన్న ఆణిముత్యాలు పథకం ద్వారా అవార్డులను అందచేస్తారు. ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరికి సత్కారించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదు తో పాటు సర్టిఫికెట్, మెడల్ అందజేస్తారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh