విద్యార్దులకు గూడ న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డ్

telangana/inter-board..

విద్యార్దులకు గూడ న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డ్..

తెలంగాణ  ఇంటర్ బోర్డ్  విద్యార్థులకు ఒక తీపి కబురు చెప్పింది.   ఇంటర్ విద్యార్థులకు వచ్చే నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నా నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనేందుకు కొన్ని  టిప్స్ అందించనున్నట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.  విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి వారిలో కాన్ఫిడెంట్ పెంచేలా ఆన్ లైన్ క్లాసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా యూట్యూబ్ ద్వారా వీడియో లెస్సన్స్ అందించనున్నారు.  విద్యార్థుల్లో టెన్షన్‌ను తగ్గించి పరీక్షలకు మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. విద్యార్థులు ఈ క్లాసులను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లర్నింగ్ తెలంగాణ’ అనే చానల్ ద్వారా వీక్షించవచ్చని స్పష్టంచేశారు.

ఇప్పటికే 2023 ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం హాల్టికెట్లను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది . తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 2023 మార్చి 15 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బోర్డు అడ్మిట్ కార్డులను ఆయా పాఠశాలల నుంచి పొందే ఏర్పాట్లను చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. పాఠశాల అధికారులు tsbie.cgg.gov.in. ద్వారా స్కూల్ అధికారక లాగినస్ ను ఉపయోగించి టీఎస్బీఐఈ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్టికెట్ మొదటి కాపీని డౌన్లోడ్ చేసుకొనే వేసులుబాటుకలిపించింది ఇంటర్మీడియట్ బోర్డు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh