Modi : అమెరికా పర్యటనకు బయలుదేరిన

Modi

Modi : అమెరికా పర్యటనకు బయలుదేరిన

Modi : ప్రధాని మోడీ ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.

అలాగే ప్రధాని మోడీ న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవంలో కూడా పాల్గొంటారు.

పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా అమెరికాలోని భారత సంతతి వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా ప్రధాని మోడీ సమావేశమవుతారు.

అయితే న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని, అమెరికా వెళ్లే ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగా, అధ్యక్షుడు బిడెన్‌తో చర్చలు, యుఎస్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించడంతో సహా అనేక కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

ఇక జూన్ 22వ తేదీన వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్తారు. వైట్ హౌస్‌లో జో బైడెన్‌తో సమావేశమౌతారు.

బైడెన్- అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.

తరువాత అమెరికా జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని Modi :  ప్రసంగిస్తారు.

జూన్ 23వ తేదీన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో లంచ్ భేటీలో పాల్గొంటారు.

కాగా  వివిధ మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో Modi :  భేటీ అవుతారు.

అమెరికా పర్యటనను ముగించుకుని ఈజిప్ట్‌కు బయలుదేరి వెళ్తారు.

ఈజిప్ట్ పర్యటన సందర్భంగా ప్రఖ్యాత అల్ హకీమీ మసీదును సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

బోహ్రా కమ్యూనిటీ ఈ మసీదును పునరుద్ధరించింది.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరైన విషయం తెలిసిందే.

ప్రధానిగా మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh