Jagannath Ratha Yatra : మరికాసేపట్లో జగన్నాథుని రథయాత్ర …
Jagannath Ratha Yatra : ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ఇవాళ ప్రారంభమవుతోంది. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు.
అయితే కరోనా కారణంగా ఈ యాత్రకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఈ సంవత్సరం కరోనా లేకపోవడంతో రథయాత్రను అద్భుతంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లూ చేశారు. మొత్తం 10 రోజులు ఈ యాత్రం పండుగలా సాగనుంది.
జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి ఈ మహా పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.
పూరి నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది. హిందూ విశ్వాసం ప్రకారం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి నగరంలో విహరిస్తారు.
ఈ రథయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద చెక్క రథాన్ని సిద్ధం చేశారు.
ఈ రథాన్ని ని లాగడమే కాకుండా.. కనీసం రథం తాళ్లను తాకినా, కదిలించినా కూడా పుణ్యమైన కార్యక్రమంగా భావిస్తారు.
అయితే పురాణాల ప్రకారం జగన్నాథ రథయాత్రలో జగన్నాథ స్వామి రథంలో తన అత్తవారిల్లు గుండిచాకు వెళ్తారు.
ఇప్పుడు గుండిచా Jagannath Ratha Yatra : ఆలయాన్ని జగన్నాథుని అత్తవారి ఇల్లుగా భావిస్తున్నారు.
అత్తవారింట్లో జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో వారంపాటూ ఉంటారు. అక్కడ ఆతిథ్యం స్వీకరిస్తారు.
అయితే శ్రీకృష్ణుడు తన మేనత్త ఇంట్లో తన తోబుట్టువులతో కలిసి ఆతిథ్యం స్వీకరిస్తూ… విందును ఆరగిస్తారని..
రకరకాల వంటకాలు రుచి చూస్తారని భక్తులు చెబుతుంటారు. విందు తర్వాత స్వామి 7 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
ఇలా వెళ్లే సమయంలో ముందు భాగంలో బలరాముడు, Jagannath Ratha Yatra : మధ్యలో సుభద్ర దేవి, వెనుక శ్రీ కృష్ణుడి రథం బయలుదేరుతుంది.
పూరీ రథయాత్రలోని మూడు రథాలు వేర్వేరు ఎత్తులలో ఉండి వివిధ రంగుల దుస్తులతో అలంకరించబడి ఉంటాయి.
అయితే దీనిని అజ్ఞాతవాసంగా పిలుస్తారు. ఆ తర్వాత జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇస్తారని చెబుతారు.