యువర్ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా లవ్ యు కేసీఆర్ గారు: బండ్ల గణేశ్‌

bandla-ganesh-tweets

యువర్  వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా లవ్ యు కేసీఆర్ గారు: బండ్ల గణేశ్‌

ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంతోషమొచ్చినా  కోపమొచ్చినా అసలు తట్టుకోలేడు. ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. బండ్లన్న మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అసలు వివరాలలోకి వెళ్ళితే తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు బండ్ల గణేశ్‌ తన  సతీమణితో కలిసి ఈ దేవాలయానికి వెళ్లిన అక్కడి శిల్పకళా సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎన్నో రోజుల నుంచి శ్రీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.ఆ స్వామి వారి అనుగ్రహం లేక నాకు రావడం కుదరలేదు, కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి, ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అయిన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్న బండ్ల ⁦ తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకు పోతుంది అని చెప్పడానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం శ్రీ కేసీఆర్ గారి ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను, ⁦ చాలా సంతోషం అనిపించిందని అన్నారు.

ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను, మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నానని అన్నారు.  ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక, మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పదని బండ్ల అన్నారు.

ఇక ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని  అన్నారు బండ్ల  అలాగే ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్  రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడిందని అది తనకు ఆనందాన్నిస్తుందని అన్నారు. ఇక ⁦ నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు  మీద ఉండాలని, మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఏ స్వార్ధం కోసమో ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు, నా మనసులోని మాటలు చెప్తున్నానని పేర్కొన్న ఆయన మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను, అది నా నైజం సార్, మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా లవ్ యు కేసీఆర్ గారు అంటూ ఆయన వరుస ట్వీట్లు చేస్తూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా  మారింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh