నేడే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణా ప్రభుత్వం

Telangana Budget 2023

నేడే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణా ప్రభుత్వం

ఎన్నికలకు ముందుగా వచ్చే చివరి బడ్జెట్‌ను ఈ రోజు తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ కు నిన్న కేసిర్  మరియు తెలంగాణా మంత్రి వర్గం తెలిపింది. కేసిఆర్ అధ్యక్షతన నిన్న  జరిగిన మంత్రి వర్గం సమావేశంలో  2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై చర్చించి బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. దాదాపు రూ. 3 లక్షల యాభై కోట్ల బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తుంది.  చివరి బడ్జెట్ ఇదేకావడంపై  ఈ బడ్జెట్  పై అందరు చాల ఆసక్తిగా ఎదురుస్తున్నారు.

అలాగే  ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశానికి అందరు మంత్రులు తప్పకుండ హాజరుకావాలని సీఎం కేసీఆర్ అదేశింనట్లు తెలుస్తుంది. ఆదివారం  జరిగిన సమావేశంలో ప్రధానంగా  ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించి మంత్రులకు దశ  దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి.  ఈ సంవత్సరం లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈదశ లో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. సుమారుగా   నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా  పది అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరూ తప్పకుండా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

బడ్జెట్ సమావేశాల నిర్వహన, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్ భేటీలో మార్గనిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఇంకా ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను అంచనా  వేసుకుని రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం భారీ అంచనాలతో రూ. 2.52 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

 

ఇది కూడా చదవండి:

 

 

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh