ఐపిఎల్ లో రుతురాజ్ సిక్సర్ల సునామీ

IPL 2023: ఐపిఎల్ లో రుతురాజ్ సిక్సర్ల సునామీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ ఘనంగా ఆరంభమైంది.  ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరికింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.  గైక్వాడ్ బంతులను యథేచ్ఛగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే గుజరాత్ ప్లేయర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లతో విజయం సాధించింది. దాంతో లీగ్ లో హార్దిక్ పాండ్యా సేన బోణీ కొట్టిం

చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే గత సీజన్ లో పేలవ ప్రదర్శన చేసింది. పేలవ ప్రదర్శన తర్వాత కమ్ బ్యాక్ చేయడం చెన్నైకి అలవాటైన విషయం. 2020లో నిరాశ పరిచిన ఆ జట్టు 2021 చాంపియన్ గా నిలిచింది. ఇక 2022లో ఫెయిల్ కావడంతో 2023లో ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ డొల్లతనం భయటపడింది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పేలవ ప్రదర్శన చేసింది. అలా అని బ్యాటింగ్ లో గొప్పగా ఏం చేసింది లేదు. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ను తీసేస్తే చెన్నై చేసిన పరుగులు 80లోపే ఉంటాయి.  అయితే  మ్యాచ్ లో చెన్నై ఓడినా రుతురాజ్ గైక్వాడ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి.

అలాగే తొలి బంతి నుంచి చక్కటి టైమింగ్ తో బ్యాటింగ్ చేశాడు. 14 పరుగుల వద్ద డెవోన్ కాన్వే (1) తొలి వికెట్‌గా వెనుదిరిగినప్పటికీ గైక్వాడ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఆడాడు. క్రీజులోకి వచ్చింది మొదలు బ్యాట్‌తో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు.

అంతేకాదు, ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి సిక్సర్, తొలి అర్ధ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గానూ రికార్డులకెక్కాడు. రుతురాజ్ ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ సులభంగా 200 మార్కును దాటుతుందనిపించింది. ఒక ఎండ్ లో కాన్వే (1), స్టోక్స్ (7), మొయిన్ అలీ (23), అంబటి రాయుడు (12), శివమ్ దూబే (19), జడేజా (1) పెవిలియన్ కు క్యూ కట్టారు. అయినా మరో ఎండ్ లో రుతురాజ్ మాత్రం సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. దాదాపు 184 స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించాడు. చూస్తుంటే 2021 రుతురాజ్ గైక్వాడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినట్లు అనిపించింది.

రుతురాజ్ బంతిని మిడిల్ చేసిన విధానం చూస్తే చెన్నై జట్టుకు అతడే ఒక పెద్ద సైన్యంలా కనిపిస్తున్నాడు. ఒకరంకంగా చెప్పాలంటే చెన్నై జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలా రుతురాజ్ కనిపిస్తున్నాడు. అతడు రాబోయే మ్యాచ్ ల్లో విఫలం అయితే మాత్రం చెన్నై 2022లో చేసిన ప్రదర్శనే మరోసారి రిపీట్ చేసేలా కనిపిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

. 10+

11222222221Q11111111112202220XXXXXX

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh