Student NO-1 ’కి..NTR ని హీరోగా పెట్టడం రాజమౌళికి ఇష్టం లేదా?

Student NO 1 ’కి..NTR ని హీరోగా పెట్టడం రాజమౌళికి ఇష్టం లేదా?

Student no-1 యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కమర్షియల్ హీరోగా గుర్తింపు, అదే స్థాయిలో హిట్‌ను తీసుకొచ్చిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు బాలనటుడిగా రెండు చిత్రాలు, హీరోగా ఒక చిత్రం చేసిన అనుభవం మాత్రమే ఉంది. ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం మాత్రం ఎన్టీఆర్‌లోని అన్ని కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాతోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్టవడమే కాకుండా..

ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అశ్వనీదత్ ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.బుల్లితెరపై అలీ హోస్ట్‌గా చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్.. ఈ సినిమాకు మొదట హీరోగా ప్రభాస్‌ని అనుకున్నామని తెలిపారు. ‘రాజకుమారుడు’తో మహేష్ బాబు, ‘చిరుత’తో రామ్ చరణ్, ‘గంగోత్రి’తో అల్లు అర్జున్‌లని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అశ్వనీదత్.. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ప్రభాస్‌ని పరిచయం చేయాలని అనుకున్నామని తెలిపారు. కానీ హరికృష్ణగారు ఫోన్ చేయడంతో..

చివరికి ఆ సినిమా తారక్‌కి వచ్చిందంటూ అశ్వనీదత్ చెబుతున్న వీడియోని నెటిజన్లు కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నిజంగా ప్రభాస్ ఆ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో.. అంటూ వారు కామెంట్స్ చేస్తుండటం విశేషం. 2001లో వచ్చిన ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన ప్రభాస్.. ఆ సినిమా తారక్ చేయడంతో.. 2002లో ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

అద్భుతమైన ఐడియాతో ‘ఆర్ఆర్ఆర్2’

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ . రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. థియేటర్‌లో మూవీని మిస్ అయినవారంతా ఓటీటీలో వీక్షిస్తున్నారు. ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. హాలీవుడ్‌కు చెందిన అనేక మంది ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఫలితంగా ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది.

అకాడమీ పురస్కారాల కోసం పలు కేటగిరీల్లో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. మూవీ పూర్తయిన అనంతరం క్వశ్చన్ అండ్ అన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌లో జక్కన్న పాల్గొన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అద్భుతమైన ఐడియాతో సీక్వెల్ తెరకెక్కుతుందని చెప్పాడు.సినిమా విజయం సాధించిన అనంతరం కథను కొనసాగిస్తారా అనే ఆసక్తి తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఐడియాతో మరో సినిమాను తెరకెక్కించవచ్చా అని ఆలోచిస్తాను.

ఆ ఐడియాతో చిత్రాన్ని రూపొందించలేకపోతే కథను కొనసాగించను. ఆర్థిక లాభం కోసం కూడా మూవీని చేయను. ఆ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే మా దగ్గర కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. అవి ఆసక్తికరంగా లేకపోవడంతో పక్కన పెట్టేశాం. కొన్ని వారాల క్రితమే మా కుటుంబ సభ్యులకు ఓ లైన్ తట్టింది. అది నాకు చెప్పగా అద్భుతమనిపించింది.

ఎంతో మంది కలసి పనిచేస్తేనే మూవీ రూపొందుతుంది. ముఖ్యంగా పూర్తి స్క్రిఫ్ట్ సిద్ధం కావాలి. తర్వాత ఏ విధంగా తెరకెక్కించాలి, రూపొందించాలి అని ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది. ఆ పాయింట్‌తోనే ‘ఆర్ఆర్ఆర్2’ (RRR2) చేస్తాను’’ అని ఎస్‌ఎస్. రాజమౌళి తెలిపాడు.

ఇండియానా జోన్స్’ తరహాలో మహేశ్ బాబు సినిమా

బాహుబలి’ ప్రాంచైజీకి దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువైన డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli). అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ను తెరకెక్కించి హాలీవుడ్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అతడి నుంచి ఏ చిత్రం వస్తుందా అని ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, మహేశ్ బాబుతో మూవీ చేయనున్నట్టు జక్కన్న కొన్నాళ్ల క్రితమే తెలిపాడు. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర కబుర్లను మీడియాతో పంచుకున్నాడు.

రాజమౌళి, మహేశ్ సినిమాను SSMB29 అని వ్యవహరిస్తున్నారు.. ‘‘ఇప్పటికే కథ రాయడం ప్రారంభించాం. నా అనేక సినిమాలకు స్టోరీలను మా నాన్నే రాశారు. మా కుటుంబ సభ్యులు, ఇతర కోర్ టీమ్ కలసి కథను డెవలప్ చేయడం కొన్ని నెలల క్రితమే మొదలుపెట్టాం. ఇది అడ్వెంచరస్ స్టోరీ. చాలా కాలంగా అడ్వెంచర్ సినిమా చేయాలని నాకు ఉంది. నా అల్‌టైం ఫెవరేట్ మూవీస్‌లో ‘ఇండియానా జోన్స్’ ఒకటి. డాన్ బ్రౌన్ తరహాలో రాసిన నవలలు అంటే నాకు చాలా ఇష్టం. ఇటువంటి జోనర్‌లో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను.

ప్రపంచచాన్ని చుట్టి వచ్చే సాహసకుడి కథగా చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాను. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతుంది’’ అని ఎస్‌ఎస్‌. రాజమౌళి తెలిపాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా గతంలో ఈ సినిమా గురించి మాట్లాడాడు. రాజమౌళితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాడు. సినిమాలోని పాత్ర ఫిజికల్‌గా చాలా డిమాండ్ చేస్తుందన్నాడు. జక్కన్నతో ఒక్క సినిమా చేస్తే పది సినిమాలకు పనిచేసినట్టే అని చెప్పాడు.

RC15..శంకర్ మార్క్ లో ఈ భారీ సాంగ్.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మావెరిక్ దర్శకుడు శంకర్ తీస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అనేక అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే ఈ భారీ సినిమా కోసం గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గానే చిత్ర యూనిట్ అంతా న్యూజిలాండ్ కి పయనమైన సంగతి తెలిసిందే.అక్కడ మెగా పవర్ నుంచి ఓ సాలిడ్ వర్కౌట్ వీడియో కూడా మంచి కేజ్రీగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇక్కడ మాత్రం శంకర్ చరణ్ మరియు కియారాల మధ్య ప్లాన్ చేసిన భారీ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. శంకర్ మార్క్ లో మాంచి మ్యాజికల్ గా ఈ సాంగ్ ని లావిష్ విజువల్స్ తో శంకర్ డిజైన్ చేస్తున్నారట. మరి డెఫినెట్ గా ఈ సాంగ్ సినిమా సినిమాలో గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సినిమాసమంత ప్రోమోలో ‘NC’ ని ఎందుకు హైలైట్ చేశారు..?

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “యశోద”. హరి & హరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.యశోద” సినిమాకి పెట్టిన బడ్జెట్ మరియు ఇప్పటి వరకూ సాధించిన వసూళ్లను బట్టి చూస్తే.. బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.

కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ ఘన విజయం సాధించిందని ఊదరగొడుతూ సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రోమోలు వదులుతున్నారు.సమంత సినిమా ఫస్ట్ వీక్ లో ఎంత వసూలు చేసిందనే లెక్కలు పక్కన పెడితే.. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన “యశోద” మూవీకి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.
“యశోద” సినిమా బాక్సాఫీస్ వద్ద ‘థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్’గా నిలిచిందంటూ మేకర్స్ కొన్ని ప్రోమోలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు.

అయితే THRILLING BLOCKBUSTER అనే టైటిల్ హెడర్ లో N మరియు C లెటర్స్ హైలైట్ చేయబడి ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్యని ‘NC’ అని సంబోధిస్తుంటారు. సోషల్ మీడియాలో ఏదైనా మూవీ అప్డేట్ ఇచ్చినా.. సినిమా వర్కింగ్ టైటిల్ అయినా #NC ట్యాగ్ తో మెన్షన్ చేయబడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ‘యశోద’ మూవీ ప్రోమోలో NC హైలైట్ చేయబడి కనిపిస్తోంది.నిజానికి అక్కడ ఆ రెండు లెటర్స్ ని అలా ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. యశోద సినిమాకు NC ఆంగ్ల అక్షరాలకు ఎలాంటి సంబందం లేదు. అయినా ఇలా హైలైట్ చేయడంతో కావాలనే నాగ చైతన్యని టార్గెట్ చేస్తున్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో సమంత టీమ్ కావాలని చేసిందా? ఇదంతా ఆమెకి తెలిసే జరిగిందా? లేదా న్యూస్ ఛానల్స్ ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజంగా చైతూ లక్ష్యంగా చేసిన పని అయితే.. ఏమాత్రం సరైంది కాదని ఓ వర్గం ఫ్యాన్స్ అంటున్నారు.ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య – సమంత..

నాలుగేళ్లు తిరక్కుండానే వైవాహిక బంధాన్ని ముగించారు. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వేర్వేరు మార్గాల్లో జీవితం ముందుకి సాగుతున్నారు.చై – సామ్ విడిపోతున్నట్లు ప్రకటించి కూడా యేడాది దాటిపోయింది. అయినప్పటికీ పరోక్షంగా ఇలా NC ని టార్గెట్ చేయడం సమంజసం కాదని అక్కినేని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కావాలని చేశారా? యశోద టీమ్ కి తెలియకుండానే జరిగిందా? అనేది తెలియదు కానీ.. సమంత సినిమా ప్రోమోలో NC ని హైలైట్ చేయడం హాట్ టాపిక్ నడుస్తోంది. మరి మేకర్స్ దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh