ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థత

senior leader d srinivas critically

ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థత

ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ రోజు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు మాట్లాడే అవకాశముంది. అయితే ఫిట్స్ రావడంతో డీఎస్‌ను సిటీ న్యూరో ఆస్పతికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుమారుడు, నిజామాబాద్  బీజేపీ ఎంపీ అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రికి తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కావున.. ఈ రోజు రేపు అంటే ఈ నెల 27వ తేదీ, 28వ తేదీన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు కార్యకర్తలకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh