ఆంద్రప్రదేశ్ కొత్త రాజధాని తరలింపుకు డేట్ పిక్స్…

Andhra pradesh new capital vizag

ఆంద్రప్రదేశ్ కొత్త రాజధాని తరలింపుకు డేట్ పిక్స్…

ఆంద్రప్రదేశ్ ఏపీ నూతన రాజధాని రెడీ అయ్యేందుకు విశాఖ లో అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి ఎప్పుడు పాలన మొదలు పెట్టాలి అన్నదానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  కసరత్తు చేసి ముహూర్తం పెట్టినట్టు  సమాచారం. ఉగాది నుంచి విశాఖనే ఏపీకి రాజధాని కాబోతుందా విశాఖలో సీఎం ఉండేందుకు నివాస భవనం కూడా సిద్ధమైందా? అదే జరిగితే సీఎం పూర్తిగా విశాఖకు వచ్చేస్తే అమరావతిలో అడుగుపెట్టరా లేదంటే కొన్ని రోజులు విశాఖలో మరికొన్ని రోజులు అమరావతిలో ఉంటారా అని పలుఅనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి అనుమానాలు ఎలా ఉన్నా సీఎం జగన్‌ మోహన్ గారు   విశాఖకు రావడం ఖాయమని ప్రచారం సాగుతోంది.

అయితే వారానికి 2 రోజులు మాత్రమే విశాఖలో ఉండబోతున్నారని మరో ప్రచారం ఉంది. సోమవారం ఉదయం వచ్చి సోమ, మంగళవారాలు విశాఖలో బస చేస్తారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా రెండు రోజులు విశాఖ నుంచే పరిపాలన ఉండబోతుందనేది అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం. అధికారులతో సమీక్షలు, అధికారిక సమావేశాలు ఇక్కడ నుంచే జరగబోతున్నాయని సమాచారం.అసలే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సోమ మంగళవారాలు విశాఖ నుంచి పాలన సాగించి బుధవారం ఉదయం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో గ్రామ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు వైసీపీ కీలక నేతలు చెబుతున్న మాట. ప్రతీ బుధవారం ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి రాత్రికి అక్కడే పల్లె నిద్ర చేస్తారట. మళ్లీ ఉదయాన్నే అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి గురువారం అక్కడ నుంచి అమరావతి వెళ్తారట. శుక్ర, శని, ఆదివారాలు సీఎం జగన్ అమరావతిలో ఉండబోతున్నారు.

మరోవైపు విశాఖలో రాజధానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది అంటున్నారు. అవసరమైన భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు షెడ్యూల్ ఇలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రిషికొండలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అధికారిక భవనం, కార్యాలయం పూర్తయ్యే వరకు విశాఖలో హార్బర్ పార్క్ పేరుతో ఉన్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌజ్‌లో సీఎం జగన్ బస చేయబోతున్నారట. సువిశాలమైన వాతావరణంలో ఏర్పాటు చేసి ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌లో ఒక వీఐపీ సూట్‌తో పాటు కొన్ని మిని సూట్లు, వీఐపి రూమ్స్ ఉన్నాయి. చుట్టూ పచ్చదనం నిండి ఉండి అవసరమైన పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ లో విశాఖ రాజధానిపై పూర్తి క్లారిటీ వస్తుంది ఎప్పటి నుంచి పాలన మొదలు పెట్టేది అనే విషయం అయితే  విశాఖపై పూర్తి మాస్టర్ ప్లాన్ ను పెట్టుబడి దారులకు ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh