Samantha: విజయ్ దేవరకొండకు స్పెషల్ బర్త్ డే విషెష్

Samantha

Samantha: విజయ్ దేవరకొండకు సమంత స్పెషల్ బర్త్ డే విషెష్

Samantha: నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.  రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నేడు(మే 9)న తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి విషెస్‌లు వెళ్లువలా వస్తున్నాయి. అందులో భాగంగా హీరోయిన్‌ సమంత కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్‌ చెప్పింది. సోమవారం సాయంత్రమే ఆమె విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేస్తూ విషెస్‌ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషెస్‌ తెలియజేయడం విశేషం.

అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌`,వడే సుబ్రహ్మణ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకొని పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి  `గీతగోవిందం`సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత ఎన్ని హిట్స్, ఫ్లాప్స్ వచ్చినా విజయ్ కి మాత్రం క్రేజ్ అలాగే ఉంది. యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కి ఎక్కువే. సినిమాలతోనే కాకుండా, తన స్పీచ్ లు, యాటిట్యూడ్, యాడ్స్ ఇలా అన్ని రకాలుగా యూత్ కి బాగా దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. అమ్మాయిల్లో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Also Watch

AP News: నేడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్

అయితే  సమంత, విజయ్ గతంలో మహానటి సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఖుషి సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తాజాగా సమంత విజయ్ దేవరకొండ బర్త్‌డే సీడీపీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ. నా గుడ్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన నా ఫేవరేట్ యాక్టర్ విజయ్ దేవరకొండ బర్త్‌డే సీడీపీని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రే చేస్తాను. నీకు లైఫ్ లో ప్రతి దాంట్లోను బెస్ట్ దొరకాలి. నువ్వు దానికి అర్హుడవు అని రాసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది.  అయితే గత సంవత్సరం సమంత పుట్టిన రోజుని ఖుషి సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్ దేవరకొండ గ్రాండ్ గా చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh