ప్రధాని మోదీ- షా ట్రాప్ లో “హీరో”లు : నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్…!!

టీడీపీకి సినీ గ్లామర్ తగ్గుతోంది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు టీడీపీలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. కానీ, ఇప్పుడు కొత్త సినిమా కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు వైసీపికి దగ్గరయ్యారు. అందులో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. నందమూరి కుటుంబ వారసులు టీడీపీతోనే ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ రూటు సపరేటుగా కనిపిస్తోంది. టీడీపీలోకి కొందరు నేతల శైలి..జూనియర్ ను పార్టీకి దూరం చేసింది.

టీడీపీలో ఆ గ్లామర్ ఏమైంది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగం నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు సహా మరి కొందరు దర్శక – నిర్మాతలు మాత్రం టీడీపీ శ్రేయోభిలాషులుగా కనిపిస్తున్నారు. మురళీ మోహన్ పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితం అయ్యారు. రోజా, ఆలీ, పోసాని వంటి వారు ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. నాగార్జున సీఎం జగన్ కు ఆప్తుడు. టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న హారోలను ఇప్పుడు బీజేపీ ట్రాప్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. ఆ మీటింగ్ పరమార్ధం రాజకీయమే. కానీ, తారక్ ను బీజేపీని ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోందనే వాదన ఉంది. ఇక, పవన్ కల్యాణ్ తో మరోసారి పొత్తు ద్వారా ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీకి సడన్ గా ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. పవన్ కు పీఎంఓ నుంచి ఆహ్వానం రావటం.. ప్రధాని – పవన్ సమావేశంతో అసలు టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనే చర్చ మొదలైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పైన బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేసారు. ఒక దశలో వచ్చే ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ బీజేపీ నుంచి పోటీలోకి దిగబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో.. మోహన్ బాబు గత ఎన్నికల్లో వైసీసీకి మద్దతుగా ప్రచారం చేసినా..తరువాత అనేక కారణాలతో సీఎం జగన్ కు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం మోహన్ బాబు తనయుడు విష్ణు తాడేపల్లిలో సీఎం జగన్ తో కలిసారు. తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు తో మోహన్ బాబు భేటీ అయ్యారు. వ్యక్తిగత సమావేశం.. దేవాలయానికి సంబంధించి ఆహ్వానం కోసమే కలిసారంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే, గతంలోనే తన ఫ్యామిలీ తో ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు.. త్వరలో మరోసారి ప్రధానితో భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ పైన మోహన్ బాబు పలు సందర్భాల్లో ప్రధాని పైన తన అభిమానం చాటుకున్నారు. దీంతో..ఇప్పుడు తొలి నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్న టాలీవుడ్ మద్దతు టీడీపీకి తగ్గిపోయింది. మరి..ఇప్పుడు బీజేపీ నేతలతో సఖ్యతగా ఉంటున్న ఈ హీరోలు.. ఎన్నికల సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh