Tughlak Lane : బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Tughlak Lane

తుగ్లక్ లేన్‌లో బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Tughlak Lane 2004 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ తనకు కేటాయించిన బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. రాహుల్ గాంధీ తన ప్రభుత్వ నివాసం తాళాలను అందజేశారు.

ఏప్రిల్ 22లోగా 12 తుగ్లక్ లేన్ లోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

ఇంటిని ఖాళీ చేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మై సచ్ బోల్నే కీ కిమాత్ చుకా రహా హు (నిజం మాట్లాడినందుకు నేను మూల్యం చెల్లిస్తున్నాను) అని అన్నారు. సోనియాగాంధీ నివాసమైన 10 జన్ పథ్ లో కొంతకాలం బస చేస్తానని చెప్పారు.

“నేను అన్ని సమస్యలను గట్టిగా లేవనెత్తుతాను ఎందుకంటే ఎవరైనా తన స్వరాన్ని పెంచాలి (మై సారే ముద్దే ఉతౌంగా జోరో సే ఉతౌంగా క్యూకి కిసి నా కిసి కో టు ఉతానా పడేగా)” అని ఆయన అన్నారు.

అయితే తన సోదరుడు ఏది చెప్పినా అది నిజమేనని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని, దాని ఫలితమిది అన్నారు. (భాయ్ నే జో బోలా వో సచ్ హై. ఉన్హోనే సర్కార్ కీ ఖిలాఫ్ బోలా ఇస్లియే యే సబ్ హో రహా హై).

‘ఆయన చాలా ధైర్యవంతుడు. నేను అతనితో ఉన్నాను (వో బహుత్ హిమ్మత్ వాలే హై). మై ఉంకే సాత్ హు)” అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 11న రాహుల్ గాంధీ తనపై అనర్హత వేటు పడినంత మాత్రాన బెదిరిపోనని, ఆ ఇంట్లో ఉండేందుకు తనకు ఆసక్తి లేదని చెప్పారు.

‘ఎంపీ అనేది కేవలం ట్యాగ్ మాత్రమే.

ఇది ఒక పోస్ట్. బీజేపీ ఆ ట్యాగ్ ను, పదవిని, ఇంటిని తీసేయవచ్చు లేదా నన్ను జైల్లో పెట్టవచ్చు. కానీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా వారు నన్ను ఆపలేరు’ Tughlak Lane అని రాహుల్ గాంధీ వయనాడ్ లో జరిగిన బహిరంగ సభలో అన్నారు.

‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంది’ అనే వ్యాఖ్యలపై రాహుల్ గాంధీని దోషిగా తేల్చారు. కాంగ్రెస్ ఎంపీపై అనర్హత వేటు వేయడంతో ఎన్నికల కమిషన్ సహా సంబంధిత అధికారులకు సమాచారం పంపారు.

తుగ్లక్ లేన్ లోని 12వ నంబర్ లో తన వసతిని రద్దు చేస్తూ 2023 మార్చి 27న మీరు రాసిన లేఖకు ధన్యవాదాలు అని రాహుల్ గాంధీ లోక్ సభ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ మోహిత్ రాజన్ కు లేఖ రాశారు.

తాను ఇక్కడ గడిపిన ఆనందకరమైన జ్ఞాపకాలకు ప్రజల తీర్పుకు రుణపడి ఉంటానని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. తన హక్కులకు భంగం వాటిల్లకుండా మీ లేఖలోని వివరాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

మరోవైపు పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది.

తనకు రెండేళ్లు జైలు శిక్ష విధించాల్సినంత కేసు కాదని..

ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

శిక్షను నిలిపివేయని పక్షంలో తన ప్రతిష్టకు నష్టం కలుగుతుందని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై గత Tughlak Lane గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ రోజు తుది తీర్పును వెలువరించింది.

అయితే రాహుల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్ట్ తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం వుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh