PM Modi : విదేశీ పర్యటన ముగించుకుని భారత్ కి చేరుకున్న మోదీ 

PM Modi

 PM Modi : విదేశీ పర్యటన ముగించుకుని భారత్ కి చేరుకున్న మోదీ

PM Modi  : ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ  ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు.

పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు.

ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు హర్ష వర్ధన్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ప్రధాని మోదీ వచ్చీ రాగానే.

. దేశంలో ఏం జరుగుతోందంటూ జేపీ నడ్డాను ప్రశ్నించినట్లు అక్కడకు వెళ్లిన పార్టీ నాయకులు తెలిపారు.

ఈనెల 20న అమెరికా పర్యటన వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ నెల 21వ తేదీన ఐరాసలో ప్రపంచ యోగా దినోత్సవం పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ.. రక్షణ, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్‌లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు మోదీ.

అలాగే అమెరికాలో మూడ్రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా

నుంచి నేరుగా శనివారం కైరో చేరుకున్న ప్రధాని మోదీకి ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌ బౌలీ స్వాగతం పలికారు.

మొదటి సారి ఈజిప్టు వెళ్లిన ప్రధాని ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరిపారు.

అరబ్ దేశం అత్యున్నత గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ను ప్రధాని మోదీ అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. రెండు దేశాలు తమ సంబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం”గా పెంచుకున్నాయి.

ప్రెసిడెంట్ ఎల్-సిసి మోడీకి ఈజిప్ట్ అత్యున్నత రాష్ట్ర గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ అవార్డును ప్రదానం చేశారు.

ప్రధాని మోదీకి లభించిన 13వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది.  అయితే ప్రధాని మోది  ఈజిప్ట్ పర్యటనకు వెళ్ళడం ఇది మొదటిసారి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh