‘పుష్ప 2’లో సాయిపల్లవి – ఏ పాత్ర కోసమంటే

pushpa2 to feature sai pallavi

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా పాన్ ఇండియా హిట్ ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ మాస్ ఎంటర్టైనర్ ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నరు. ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యకినచి చెప్పవలసిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో ‘తగ్గేదేలే’ అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. ‘పుష్ప’ ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ వస్తున్న సంగతి తెలిసిందే .

ఈ సినిమాకి  సంబందించి అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే సాయి పల్లవి త్వరలో సినిమాలో జాయిన్ అవనున్నట్లు సమాచారం.కాగా ఈ సినిమాలో సాయి పల్లవి అతిథి పాత్రలో కనిపించబోతుందని, ఇప్పటికే 10 రోజుల పాటు షూటింగ్ కోసం కేటాయించిందని సమాచారం. నిర్మాతల నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉండగా, ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా యాక్షన్ డ్రామా ఉన్న కారెక్టర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ‘పుష్ప: ది రైజ్‘ లో ఆకట్టుకునే తారాగణంలో సాయి చేరడంతో పుష్ప అభిమానులంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు.

కాగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూన్నారు.  సాయి పల్లవి ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే ఆమెను తీసుకునేందుకు దర్శకుడు సుకుమార్ సిద్ధంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కనిపించబోయే పవర్ ఫుల్, మరపురాని గిరిజన యువతి పాత్ర కోసం సాయిని సుకుమార్ పరిశీలించినట్లు తెలుస్తోంది. పుష్ప: ది రైజ్ గురించి మాట్లాడుతూ, 2021 లో ఈ చిత్రం తెరపైకి వచ్చినప్పటి నుండి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు, ఈ చిత్రంలోని మేనరిజమ్స్ ఇప్పుడు సామాన్యులు మరియు సెలబ్రిటీలు కూడా అనుకరిస్తున్నారు. తన సినిమా విజయంతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్.

దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ తర్వాత కొన్ని నెలల్లోనే మార్కెట్లలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. కాగా  ‘పుష్ప’ పార్ట్ 2ని 2023లో విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్  భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh