పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు దానయ్య. ఈ సినిమాతో పవర్ స్టార్ కూడా పాన్ ఇండియా రేసులో దిగుతున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమా ఓపెనింగ్ రోజే థమన్ మ్యూజిక్ తో డైరెక్టర్ సుజిత్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని అలరించగా ఇక సినిమా టీజర్ తో అంచనాలు రెట్టింపు చేయాలని చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టీజర్ ఆయన బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ ఓజీ టీజర్ తోనే సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. పవన్ సినిమా హిట్ పడితే ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా బ్రో అంటూ వచ్చి ఆడియన్స్ ని అలరించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఓజీ తో పిచ్చెక్కించబోతున్నాడు. ముఖ్యంగా పవర్ స్టార్ ని నేషనల్ లెవెల్ స్టార్ ని చేయాలని అతని అభిమాని సుజిత్ బలంగా ఫిక్స్ అయ్యాడు. ఆ ప్లాన్ తోనే ఓజీని చాలా ఫోకస్ తో తీస్తున్నాడు. రన్ రానా రన్ తో హిట్ అందుకున్న సుజిత్ ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. పవన్ ఓజీ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే సుజిత్ కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.