Pawan Kalyan : పై ఫైర్ అయిన ముద్రగడ….. లేఖ విడుదల

Pawan Kalyan

Pawan Kalyan : పై ఫైర్ అయిన ముద్రగడ….. లేఖ విడుదల

Pawan Kalyan :  ఏపీలో  రాజకీయ పార్టీలు ఒక పార్టీ పై మరొక పార్టీ కౌంటర్ లు వేయడం తార స్థాయికి చేరింది. తాజాగా   కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై కాపు నేత ముద్రగడ పద్మనాభం నేడు  ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను వీధి రౌడీతో పోల్చారు.

ఎమ్మెల్యేలను విమర్శించి టైం వేస్ట్ చేసుకోవద్దని హితవు పలికారు. అంతేకాదు వారాహి యాత్రలో పవన్ చేస్తున్న పలు వ్యాఖ్యలకు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు.

కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసిన నేతలు రాజకీయంగా ఎదుగుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన

వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు  ఆయనకు ఓ లేఖ రాశారు.

ఇందులో ముద్రగడ పలు విషయాల్ని ప్రస్తావించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగలేదన్నారు.

అలాగే యువతను Pawan Kalyan : వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని, చంద్రబాబు

వల్ల పోగొట్టుకూన్న రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్ధితి చంద్రబాబు ద్వారానే పవన్ కల్పించారన్నారు.

మరి తనకంటే బలవంతుడైన పవన్ కళ్యాణ్ ఉద్యమం చేపట్టి కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

గతంలో జగ్గంపేట సభలో అప్పటి విపక్ష నేత జగన్ కాపులకు రిజర్వేషన్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినప్పుడు తానేం చెప్పానో గుర్తుచేసుకోవాలని పవన్ కు సూచించారు.

కాపులకు రూ.20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని, బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సీఎం చేయమని అడిగినట్లు ముద్రగడ గుర్తుచేశారు.

అలాగే కాకినాడ ఎమ్మెల్యేద్వారంపూడి  అవినీతిపరుడైతే రెండుసార్లు ప్రజలు ఎమ్మెల్యేగా ఎలా గెలిపిస్తారు. దమ్ముంటే ద్వారంపూడిపై పోటీ చేసి గెలవండి.

కాపు ఉద్యమాలకు సాయం చేసిన కుటుంబం ద్వారంపూడిది. తొక్క తీస్తా, నార తీస్తా అనే వీధి రౌడీ భాషలో మాట్లాడడంతో మీకే నష్టం. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో..

గుండు గీయించారో సెలవివ్వాలి. 175 స్థానాల్లో పోటీ Pawan Kalyan :  చేసినప్పుడు సీఎం చేయమని అడగాలి గానీ.

. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఎలా అడుగుతార’ని ముద్రగడ లేఖలో ప్రశ్నించారు.

Mudragada: పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన ముద్రగడ..! లేఖ విడుదల

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh