Biden Visit: త్వరలో భారత పర్యటనకు
Biden Visit: అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్లో పర్యటించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఆ దేశ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. భారత్, అమెరికాల బంధానికి 2023 గొప్ప ఏడాది కానుందని పేర్కొన్నారు. క్వాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. జీ-20కి భారత్ నాయకత్వం వహించడం ప్రపంచ శ్రేయస్సుకు మరింత శక్తినిస్తుందని తెలిపారు. జీ-20 సదస్సు లో భాగంగా Biden Visit రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, జానెత్ యెల్లెన్, గినా రైమోండో కూడా భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబరులో ఢిల్లీలో జరిగే భారత్-అమెరికా ఫోరమ్‌లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
బైడెన్ పర్యటనను పురస్కరించుకుని ఇండియా-యుఎస్ ఫోరమ్ ప్రత్యేక కార్యక్రమాలను ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. బైడెన్ భారత్ పర్యటనపైన ఆసక్తిగా చూస్తున్నామని బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటుగా అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో , ఆంటోని బ్లింకెన్ లు కూడా ఇక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే భారత్ , అమెరికా ఫోరమ్ లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొంటారు.
అమెరికా -భారత్ సంబందాలు
అమెరికా-భారత్ సంబంధాల్లో ఇది గొప్ప ఏడాదిగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ ప్రతినిధులు అభివర్ణించారు. జీ-20 కూటమికి భారత్ ‘అపెక్’కు అమెరికాలు ఈ ఏడాది నాయకత్వం వహిస్తున్నాయని పేర్కొన్నాయి. తనకు లభించిన జీ-20 నాయకత్వ అవకాశాన్ని ప్రపంచానికి మంచిచేసే దిశగా భారత్ మరింతగా శక్తివంతంగా మలచుకుంటోందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్ లూ ప్రశంసించారు. ‘ఈ ఏడాది జీ-20కి భారత్ అమెరికా.. జీ-7కి జపాన్ ఆతిథ్యం అందిస్తోంది. ఇలా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తోన్న క్యాడ్‌లోని సభ్యులు చాలా మంది ఉన్నారు. ఈ ఏడాది మేమంతా ఏదో ఒక ప్రపంచ బాధ్యతల్లో ఉంటూ మరింత సన్నిహితులమయ్యాం కొన్నినెలల్లో జరిగే భారత్ పర్యటన కోసం మేమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మరెన్నో అద్భుతాలకు ఈ పర్యటన తప్పక మంచి సందర్భం అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.