ఫాన్స్ కు బర్త్ డే గిప్ట్ ఇవ్వబోతున్న రామ్ చరణ్

on-the-occasion-of-𝐌𝐄𝐆𝐀-𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑

ఫాన్స్ కు బర్త్ డే గిప్ట్ ఇవ్వబోతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్  ఈ మాస్ హీరో 2009 బ్లాక్ బస్టర్ మగధీర ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఫాంటసీ పీరియాడిక్ డ్రామా ‘బిగ్గీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. తన ఎఫెక్టివ్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఆయనను చాలా మంది అభిమానిస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి థియేటర్లలో ప్రకంపనలు సృష్టించబోతోంది చెర్రీ సినిమా.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా `మగధీర` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈమూవీ  రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. `మగధీర` రీ రిలీజ్ అంటూ గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నప్పటికీ. అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు. ఇక ఈసినిమా పై మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించారు. దీంతో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

చిరుత సినిమాతో ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్. మగధీర సినిమాతోనే కెరీర్ స్టార్ డమ్ గా పేరుతెచ్చుకున్నారు.  ఈసినిమాతో మెగా వపర్ స్టార్ గా మారిన రామ్ చరణ్  సొంత టాలెంట్ తో ఎదిగారు. మొదట్లో కాస్త విమర్షలు ఎదుర్కోన్నా. తనను తాను మార్చుకుంటూ. కెరీర్ ను మలుచుకున్నారు  తన రెండవ సినిమా  మగధీర తో  తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను  తిరగరాశాడు చరణ్.

13 ఏళ్ల క్రితమే కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ తో మగధీర  సినిమాను నిర్మించి సాహసం చేశారు గీతా ఆర్ట్స్. అప్పట్లోనే పాన్ఇండియా సినిమాలకు ధీటుగా  అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించగా మగధీర  సినిమా దానికి మూడింతలు  వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్  అంతా పుష్కలంగా ఉన్న సినిమా మగధీర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని కాలభైరవ గా రామ్ చరణ్ , మిత్రబింద గా కాజల్ కేరక్టర్స్  ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేరు. ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతుండడంతో. అభిమానులు జోష్ మొదలైంది రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. . ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.  వినయ విధేయ రామ తర్వాత ఈ మాస్ హీరోతో ఆమె చేస్తున్న రెండో చిత్రమిది. ఆర్సీ 15లో అంజలి, జయరామ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు.

ఆర్ సి 15 చిత్రానికి ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నటుడితో ఇది ఆయనకు మొదటి సినిమా. ఆర్సీ 15లో అర్జున్ సర్జా నేతృత్వంలోని ముదల్వన్ ఛాయలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రూ.170 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో కూడా చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది కూలుడా చదవండి :

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh