Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS

Munugode ఫాంహౌజ్ కేసులో తుది తీర్పు TS

ఫాంహౌజ్ ప్రలోభ కేసులో హైకోర్టు తుది తీర్పిచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను 24 గంటల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై పోలీసుల అప్పీల్ను పరిగణనలోకి తీసుకుని ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. అటు ACB కోర్టు ఇచ్చిన నిందితుల రిమాండ్ రిజెక్ట్ తీర్పును HC కొట్టేసింది.

మనుగోడు ఉపఎన్నిక ముగిసే వరకు ఫాంహౌజ్ కేసు విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. బీజేపీ పిటిషన్పై విచారణల అనంతరం ఈ నిర్ణయం వెలువరించింది. అయితే ముగ్గురు నిందితుల రిమాండ్కు ఈ స్టే వర్తించదని పేర్కొంది.

2. ‘ట్రైలర్ చూసి బీజేపీ ఆగమవుతోంది’ .

ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన ఆడియో, వీడియోలతో బీజేపీ ఆగం అవుతోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ‘ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది. ఇకపై వచ్చే ఫుటేజ్లు చూస్తే ఏమవుతుందో. తమకు సంబంధం లేదన్న BJP కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించాలంటోంది?’ అని ప్రశ్నించారు.

ఎలక్షన్ కమిషన్ దగ్గరకు నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేవలం డమ్మీ అని అన్నారు.

 

3. చేతిలో చేయ్యేసి రాహుల్ గాంధీతో నడిచిన హీరోయిన్ పూనమ్ కౌర్…

కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేపట్టిన రాహుల్ గాంధీ జోడోయాత్ర ఇప్పుడు తెలంగాణలోకి కొనసాగుతోంది. ఇప్పటికే ఉదయం ఖమ్మం గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన రాహుల్ గాంధీ ఈరోజు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే హీరోయిన్ పూనమ్ కౌర్ సడెన్ గా రాహుల్ గాంధీ పాదయాత్రలో కనిపించడం..

అదీ రాహుల్ చేతిలో చేయి వేసి మరీ పాదయాత్ర చేయడం హాట్ టాపిక్ గా మారింది.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో నాలుగో రోజు పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ధర్మాపూర్లో ప్రారంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ వెంట నటి పూనమ్ కౌర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

4.చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం పాపం: KTR

TS: ఫామ్ హౌజ్ కేసుపై మంత్రి KTR కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. యాదగిరిగుట్టలో సంజయ్ ప్రమాణంపై స్పందిస్తూ.. ‘ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే కోర్టులు, చట్టాలు అవసరం లేదు. రేపిస్టులను సన్మానించిన చరిత్ర BJPది. అలాంటి వాళ్ల ప్రమాణాలకు విలువ ఏముంటుంది? అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడమంటే పాపం. దయచేసి సంప్రోక్షణ చేయాలని వేదపండితులను కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

5.కాణిపాకం ఆలయంలో బంగారు విభూదిపట్టి

AP: కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో విలువైన బంగారం మాయమైంది. ఇటీవల ఓ భక్తుడు స్వామివారికి బంగారు విభూది పట్టీ కానుకగా ఇచ్చారు. దీనిని మహా కుంభాభిషేకం రోజు స్వామివారికి అలంకరించారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లోనూ వాడారు. ఇటీవల తాను కానుకగా ఇచ్చిన దానికి సంబంధించిన రసీదు ఇవ్వాలని దాత అడగడంతో ఇప్పుడు ఈ ఆభరణం మిస్సైన విషయం వెలుగులోకి వచ్చింది.

6.టీ, కాఫీ తాగి గ్లాసులు తినొచ్చు.. ఎక్కడంటే?

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కొత్త ఐడియాతో టీ అమ్ముతున్నాడు. టీ తాగిన గ్లాసును పడేయకుండా కోంను తయారు చేసే బిస్కెట్ వంటి పదార్థంతో గ్లాసుగా తయారు చేసి టీని పోసి ఇస్తున్నాడు. టీ తాగిన తర్వాత దానిని తినేయవచ్చు. దీంతో ఈ టీ కోసం జనాలు క్యూ కడుతున్నారు. రోహిణిలోని శివచౌక్ ఇష్క్-ఎ-చాయ్ పేరుతో తోపుడుబండిని ఏర్పాటుచేసి యువకుడు పాపులర్ అయ్యాడు. అంతేకాదు మట్టి, గాజు గ్లాసుల్లో కూడా టీ ఇస్తున్నాడు.

7. ఆ హోటెల్లోని ఉద్యోగులంతా డెఫ్ అండ్ డెమ్ !

వినికిడిలోపం, మాటలు రాని వారిని పనిలో
పెట్టుకునేందుకు చాలా వ్యాపారసంస్థలు నిరాకరిస్తుంటాయి. కానీ, పూణేలోని ఓ రెస్టారెంట్లో డెఫ్ అండ్ డెమ్ వ్యక్తులే పనిచేస్తారు. అవును, ఆ రెస్టారెంట్లోని ఒక్కో ఫుడ్ను తెలిపేందుకు మెనూ కార్డులో సైన్స్ ఏర్పాటు చేశారు. ఏ ఫుడ్ కావాలో దానికి సంబంధించిన సైన్ను చేస్తే.. ఆ ఫుడ్ తీసుకొస్తారు. ఈ రెస్టారెంట్కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

8.“ఆర్ఆర్ఆర్” తర్వాత జపాన్ లో రిలీజ్ కి రెడీ అయిన మరో సౌత్ మూవీ!

భారతీయ చిత్రాలు విదేశాల్లో మంచి ఆదరణ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే థలపతి విజయ్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే న్యూస్ ఏంటంటే, 2021 లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్టర్ చిత్రం జపాన్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది.తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18, 2022 లో జపాన్ లో రిలీజ్ కానుంది.

లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం జరిగింది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ మరియు సిల్వర్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

9. ‘కోహ్లి, సూర్యకుమార్ను చూసి నేర్చుకోండి’ T20WC.

జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడాన్ని జీర్ణించుకోలేని ఆ దేశ మాజీలు జట్టుపై మండిపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సల్మాన్ భట్ చేరాడు. బ్యాటర్ల షాట్ సెలక్షన్ను తప్పుపట్టిన సల్మాన్.. కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ ను చూసి నేర్చుకోవాలన్నాడు. ‘ఇద్దరూ చెత్త షాట్లు ఆడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ చక్కగా ఆడారు.

విరాట్ పరుగుల కోసం తొందర పడకుండా నిదానంగా ఆడి ఆ తర్వాత విజృంభించాడు’ అని పొగిడాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh