Bandi Sanjay సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్: బండి సంజయ్

Bandi Sanjay సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్: బండి సంజయ్

సీఎం కేసీఆర్ హాజరుకానున్న చండూరు బహిరంగ సభలో ఏడుస్తూ.. నటించబోతున్నారంటూ బండి సంజయ్ అన్నారు. దీంతో మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో రెండు రోజుల పాటు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ ర్యాలీతో కేసీఆర్ దిమ్మతిరుగుతుందని చెప్పారు. సభకు వస్తున్న సీఎం మునుగోడు అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

2. ఆపరేషన్ బొగ్గు.. బీజేపీ క్విడ్ ప్రోకో : మధుయాష్కీ గౌడ్TS:-

కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకుని బీజేపీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ఆయనకు జార్ఖండ్ లోని చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని అన్నారు. ఇందుకు సంబంధించి ‘ఆపరేషన్ బొగ్గు’ పేరుతో డాక్యుమెంట్ను విడుదల చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల
కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయమంతా బ్లాక్మెయిల్ అని మండిపడ్డారు.

3.బతుకమ్మ ఆడిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (వీడియో).

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జడ్చర్ల నుంచి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వైపు వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం మార్గ మధ్యలో మహిళలు బతుకమ్మలతో వచ్చి రాహుల్ గాంధీకి, మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం వారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి గొప్పదని రాహుల్ అన్నారు.

4. వ్యాధి వల్లే సమంత ముఖం ఇలా మారిపోయిందా?

తనకు myositis వ్యాధి సోకిందని సమంత ప్రకటించడంతో తోటి నటీనటులతోపాటు అభిమానులు షాక్కు గురయ్యారు. కొన్ని నెలలుగా ఆమె బయట కనిపించడం లేదు. ఇటీవల ఓ యాడ్లో సమంత ముఖమంతా ఉబ్బిపోయి తేడాగా కనిపించింది. దీంతో సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి. అయితే myositis వ్యాధి వల్లే ఆమె ఫేస్ మారిపోయిందని తెలుస్తోంది. చికిత్స కోసమే US వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఆమె కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.సమంత అనారోగ్యంపై చిరంజీవి ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన అంతర్గత శక్తి ఏంటో తెలుసుకునేందుకు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. సమంత అంతర్గత శక్తితో కచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెను ధైర్యంగా ఉండాలని సూచించారు.

 5.ట్విటర్కు పోటీగా బ్లూస్కె.

ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే మరో కొత్త సోషల్ మీడియాను తీసుకొస్తున్నారు. కొత్త వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేశారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేటుగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఓ బ్లాగ్లో డోర్సే స్వయంగా పేర్కొన్నారు. ఒకసారి ఈ పరీక్షలు పూర్తయితే, పబ్లిక్ బీటా టెస్టింగ్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ట్విటర్కు పోటీగానే ఆయన దీన్ని తీసుకొస్తున్నట్లుగా టెక్ నిపుణులు చెబుతున్నారు.
6.ట్విటర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

ట్విటర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపిన ఎలాన్ మస్క్.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే CEO, CFO సహా కీలక పదవుల్లో ఉన్న పలువురిని తొలగించిన ఆయన ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు జాబితాను సిద్దం చేయాలని మేనేజర్లను కోరినట్లు తెలుస్తోంది. విభాగాలను బట్టి ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఉంటుందని ఓ కీలక ఉద్యోగి తెలిపారు.

7.సంచలంగా మారిన దర్శకుడు పూరి ఎమోషనల్ అండ్ తన మార్క్ లెటర్.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యిన పలు భారీ అంచనాలు చిత్రాల్లో మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “లైగర్” కూడా ఒకటి. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే మళ్ళీ బిజినెస్ మెన్ తర్వాత మోస్ట్ హైప్డ్ చిత్రంగా ఇది వచ్చింది. అయితే అది అనూహ్యంగా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. అయినా కూడా పూరి అయితే డీలా పడలేదు.
అపజయాన్ని నార్మల్ గానే తీసుకున్నాడు. కానీ మెల్లగా పరిస్థితులు మారుతుండే సరికి పూరి ఓ ఎమోషనల్ లెటర్ ని తన మార్క్ రచనతో రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది.

విజయాపజయాలు రెండు వేరే కాదు అవి ఒకటే లైఫ్ లో జరిగే ప్రతి దాన్ని ఓ సంఘటన తాలూకా ఏ పీరియన్స్ గా మాత్రమే చూడాలి తప్ప ఫెయిల్యూర్ సక్సెస్ గా చూడకూడదు అని తెలిపారు.అలాగే అయితే ఓటమి వస్తే కేవలం జ్ఞ్యానం వస్తుంది సినిమాలో హీరోలకి జరిగినట్టే అందరికీ జరుగుతాయని అంతా పొగుడుతారు తిడతారు నిజాన్ని ఎవరూ కాపాడాల్సిన పని లేదు నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది అని అలాగే తాను ఒక్క ఆడియెన్స్ ని తప్ప ఎవరినీ మోసం చెయ్యలేదు ఒక్క ఆడియెన్స్ ని తప్ప.

వాళ్ళని మళ్ళీ మంచి తప్పకుండా తీసి ఎంటర్టైన్ చేస్తానని చివరి మాటలుగా ఇందులో చెప్పారు. వీటితో పాటుగా ఇక డబ్బు అంటారా చచ్చాక ఇక్కడ నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లినవాడిని ఒక్కడిని చూపించండి నేను కూడా దాచుకుంటా అంటూ పూరి అయితే ముగించారు. దీనితో తన మార్క్ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

8.బాలయ్య తర్వాత మరో టాక్ షో లో కనిపించనున్న పవన్.?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ తో పాటుగా పవన్ పాలిటిక్స్ లో కూడా తాను బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటుగా రానున్న రోజుల్లో పవన్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తో తన టాక్ షో అన్ స్టాప్పబుల్ 2 లో కనిపించనుండడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యింది.ఇక దీని తర్వాత అయితే పవన్ మరో టాక్ షో లో కనిపించనున్నట్టుగా టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది.

పవన్ స్నేహితుడు ప్రముఖ నటుడు అలీ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి షో ఆలీ తో సరదాగా షో లో పవన్ కనిపించనున్నట్టుగా ఆలీ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే పవన్ తన షో లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు. దీనితో ఈ టాక్ మంచి వైరల్ గా మారింది.

9.విరాట్ కోహ్లీ కంటే అతనే గొప్ప బ్యాట్స్‌మన్: గౌతమ్ గంభీర్

సూర్య బ్యాటింగ్‌ను కొనియాడిన గంభీర్.. విరాట్ కోహ్లీ కంటే అతనే గొప్ప బ్యాట్స్‌మన్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో సూర్య ఇన్నింగ్స్ విశ్లేషించిన గంభీర్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్ యాదవ్‌కు లేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారు.

అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదడం అంటే మామూలు విషయం కాదు. వచ్చి రాగానే సిక్సర్ కొట్టగల సత్తా సూర్యకుమార్ యాదవ్‌కు ఉంది. విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇలా చేయలేరు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే మిగిలిన బ్యాటర్ల నుంచి ఒత్తిడిని తొలగించగలడు. అందుకే అతనే బెస్ట్ బ్యాటర్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh