Metro: ప్రయాణికుల తాకిడి తో మెట్రో కీలక నిర్ణయం

Metro

ప్రయాణికుల తాకిడి తో మెట్రో కీలక నిర్ణయం

Metro: హైదరాబాద్ మెట్రో కు ప్రయాణికుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. పగటి వేళ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండగా.. సాయంత్రానికి మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తోంది. హైదారాబ్‌లోని ప్రజలు ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను వినియోగించటం కంటే మెట్రోలో ప్రయాణించేందుకు ఎక్కువ మెుగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం మెట్రో స్టేషన్లలో కనిపిస్తున్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు ప్రయాణికులు పోటెత్తారు. ఆ స్టేషన్ ముంబయి మెట్రో స్టేషన్లనను తలపించింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో మెట్రో సర్వీసుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ Metro కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 4 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఐదు లక్షలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవరసం లేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ మేరకు షార్ట్‌లూప్‌ ట్రిప్పులను నడుపుతోంది. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రించవచ్చని మెట్రో అధికారులు చెబుతున్నారు.

ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులను నడపనున్నారు. ముఖ్యంగా రాయదుర్గం వెళ్లే మెట్రోల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంజి. దీంతో అమీర్‌పేట్ – రాయదుర్గం కారిడార్‌లో ప్రతీ 4.30 నిమిషాలకు ఒక ట్రైన్‌ను నడుపుతారు. ప్రస్తుతం ప్రతి 7 నిమిషాలకు ఓ ట్రైన్ నడుపుతుండగా. ఆ సమయాన్ని తగ్గించారు దీంతో ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలు చేరుకునే అవకాశం ఉంటుంది .

ఇదిలా ఉండగా.. Metro ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాాచారం. ఛార్జీలు పెంచాలని మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. అందుకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం కోచ్‌ల సంఖ్య పెంచకోపోవటం, మెట్రో స్టేషన్లలో మౌళిక వసతులు కల్పించటంలో ఎల్‌ఎండ్‌టీ విఫలమైనట్లు సర్కారు భావిస్తుంది. ఈ రెండింటి విషయంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకు వచ్చే వరకు టికెట్ రేట్లు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh