Samantha: ఆ నిర్మాతకు ఘాటు రిప్లై

Samantha

ఆ నిర్మాతకు ఘాటు రిప్లై ఇచ్చిన సమంత

Samantha: ఒక్కసారి సమంతను ట్రోల్ చేస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు. అలాగే, అసభ్యకరమైన కామెంట్లు, ట్రోలింగ్ విషయంలో ఇబ్బంది పడేది ఆమె కాదు. సమంత కెరీర్ ముగిసిందని ఇటీవల నిర్మాత చిట్టిబాబు అన్నారు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో నిర్మాతను చాలా సరదాగా హేళన చేసింది.

స్టార్ హీరోయిన్ Samantha ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్‌గా మారింది. య‌శోద చిత్రంతో హిట్ కొట్టిన ఆమె ఇప్పుడు శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆమె వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తోంది. ప‌ర్స‌న‌ల్‌గా, కెరీర్ ప‌రంగా ఎన్నో ఆటుపోట్లు ఎదురైన‌ప్ప‌టికీ హీరోయిన్‌గా రాణించే క్ర‌మంలో రీసెంట్ ఇంట‌ర్వ్యూలో నిర్మాత త్రిపుర‌నేని చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా సమంత కెరీర్ గురించి. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే.

ఒక  ఛానల్ ఇచ్చిన   ఇంటర్వ్యూలో మాట్లాడిన చిట్టిబాబు సామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ‌ర్ణ‌న ప్ర‌కారం శ‌కుంత‌ల అత్య‌ద్భుత‌మైన అందాల రాశి. అంత‌టి అందాల రాశిగా Samantha ఇప్పుడుందా? ఆరోగ్యం, మొహం పీక్కు పోయింది.సమంతకు ముసలి ముఖం వచ్చిందని, ఆమె శకుంతల పాత్రకు ఎలా సూటవుతుందని ప్రశ్నించారు. అంతేకాకుండా జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా నాటకాలు చేస్తుందని, సింపతితో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటోని విమర్శించారు. ఆమె ఎప్పటికప్పుడు తన అనారోగ్యం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని చిట్టిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతటితో ఆగకుండా శాకుంతలం మూవీ రిజల్ట్‌పై  కూడా ఆయన మాట్లాడారు.

రీసెంటుగా  గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతల మూవీ   అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా బాగా తగ్గాయి. ఈ చిత్రంలో సామ్ యాక్టింగ్‌పై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి.  ప్ర‌తి సినిమాకు Samantha సెంటిమెంట్ డ్రామాలు క్రియేట్ చేస్తుంది. అసలు స్టార్ హీరోయిన్‌గా సమంత కెరీర్ ముగిసిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై Samantha గట్టి కౌంటర్ ఇచ్చారు. చెవిలో జుట్టు పెరగడం గురించి మాట్లాడుతూ పరోక్షంగా ఆయనకు చురకంటించారు. జనాలకు చెవుల్లో నుంచి జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్‍‌లో సెర్చ్ చేసిన సామ్ టెస్టోస్టిరాన్ హార్మన్ ఎక్కువగా ఉండటం వల్ల అలా వస్తుందని పేర్కొన్నారు. ఎవరి పేరును ప్రస్తావించకుండానే ‘ఈ వ్యక్తి కే  (సిక్)’ అని రాసుకొచ్చింది. అది చిట్టిబాబుపై విరుచుకుపడటం అని గ్రహించడానికి ఆమె అభిమానులకు సమయం పట్టలేదు. సామ్ పోస్టుపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తనపై కామెంట్ చేసిన వ్యక్తిగి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిందంటూ స్పందనను తెలియజేస్తున్నారు.

.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh