Koratala-Ntr30 కథని మలుపు తిప్పడానికి వస్తున్న జాన్వీ?
#యంగ్ టైగర్ NTR30 వ చిత్రం Koratala శివ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. సినిమా పై ఇప్పటికే వచ్చిన రకరకాల పుకార్లు అన్నింటిని పీఆర్ టీమ్ ఖండించింది. షూడింగ్ డిలే…హీరోయిన్ ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు? అని నెట్టింట జరిగిన ప్రచారాలన్నింటిని కొట్టిపారేసి వచ్చేస్తున్నాం? అన్న సంకేతాలు పాస్ చేసింది.
మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది koratala క్లారిటీ ఇవ్వలేదు గానీ… అన్ని రకాల పుకార్లకు తాత్కాలికంగా పుల్ స్టాప్ మాత్రం పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నాయిక విషయం వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎంపికైందంటూ పాత పాటే మళ్లీ తెరపైకి వస్తుంది. టైగర్ -జాన్వీ జోడీ తెరపై అద్భుతంగా..అందంగా ఉంటుందని..చూడ ముచ్చటైన జంట అంటూ అంతా పొగిడేస్తున్నారు.పాత్ర పరంగా జాన్వీ మాత్రమే ఆరో ల్ కి మ్యాచ్ అవుతుందని భావించి కొరటాల పట్టుబట్టి మరీ జాన్వీని ఎంపిక చేసినట్లు బలమైన ప్రచారం సాగుతోంది.
సహజంగా కొరటాల సినిమాలో హీరోయిన్ అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా ఉండదు. నాయిక పాత్ర కు సమన్యాయం చేస్తారు. Koratala తొలి సినిమా నుంచి ఈ కండీషన్ ఫాలో అవుతున్నారు.కథని మలుపు తిప్పడానికి హీరోయిన్ పాత్రని బలంగా రాస్తారు అన్న పీడ్ బ్యాక్ ఉంది.
ఈ నేపథ్యంలో NTR30 సినిమాలో జాన్వీనే అనుకుంటున్నారు అంటే? హీరోయిన్ పాత్ర ఇంకెంత స్ర్టాంగ్ గా ఉంటుందన్నది గెస్ చేయోచ్చు. ఇలా జాన్వీ పేరు వినిపించడం కొత్తేం కాదు. ఇప్పటికే అమ్మడి పేరు రేసులోకి వచ్చింది. అలియాభట్ తప్పుకోగానే జాన్వీ పేరునే తెరపైకి వచ్చింది.
ఆ తర్వాత పలువురు పేరున్న భామల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే మరోసారి అంతర్జాలంలో జాన్వీ పేరు హాట్ టాపిక్ మారడం విశేషం. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోతే అమ్మడి పేరు ఏ కారణంతో తెరపైకి వస్తుంది అని బలంగా వాదించే వాళ్లు లేకపోలేదు. మరి జాన్వీ ఉందా? లేదా? అన్నది Koratala & యూనిట్ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.
సినిమాచరణ్ నెక్స్ట్ సినిమా ఆ ఇద్దరిలో ఎవరితో?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా శంకర్ సినిమాను మొదలు పెట్టడం జరిగింది.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సమయంలోనే చరణ్ మరో సినిమా చేయాలని భావించాడు.శంకర్ సినిమా తో సమాంతరంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ను చరణ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట.
కానీ కొన్ని కారణాల వల్ల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందాల్సిన చరణ్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. గౌతమ్ తో చరణ్ తదుపరి సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలు అయ్యింది.రామ్ చరణ్ 16వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఇద్దరు దర్శకుల వైపు చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మొదటగా సుకుమార్ వైపు కాగా మరో దర్శకుడు త్రివిక్రమ్.ఇప్పటికే రంగస్థలం సినిమాను సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనిలో ఉన్న సుకుమార్ వచ్చే ఏడాది చివరి వరకు అదే సినిమా పనిలో ఉంటాడు.
ఇక త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు తో ప్రస్తుతం చేస్తున్న సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నాడుశంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది.
కనుక రామ్ చరణ్ మరియు త్రివిక్రమ్ ఒకే సారి ఖాళీ అవుతారు. దాంతో ఇద్దరి కాంబో లో సినిమా వచ్చే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి చరణ్ తదుపరి సినిమా సుకుమార్ తోనా? త్రివిక్రమ్ తోనా? అనే విషయంలో ఫ్యాన్స్ క్లారిటీ కోరుకుంటున్నారు.
సినిమాసమంత సినిమాకు అది కూడా కలిసి వస్తుందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా తెలుగు తో పాటు ఇతర భాషల్లో నవంబర్ 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఒక సారి విడుదల వాయిదా పడి తాజాగా విడుదల కాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే పరిస్థితి లేదు. ఆమె తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్న విషయం తెల్సిందే.
ఆమె బెడ్ పై.. చేతికి సెలైన్ ఉండగా యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన విషయం తెల్సిందే. అలాంటి సమంత సినిమా ప్రమోషన్ కు వచ్చే పరిస్థితి లేదు అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సమంత గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక యశోద సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే దక్కింది.
యశోద సినిమా కు సమంత పబ్లిసిటీ చేయకున్నా కూడా తప్పకుండా సానుభూతి కలిసి వస్తుందని.. తప్పకుండా సినిమా కు జనాల నుండి స్పందన ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ దక్కించుకునేలా సానుభూతి ఉంది అనడంలో సందేహం లేదు.
సమంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కథ మొత్తం కూడా సరోగసి విధానం.. ఆ పేరుతో చట్ట విరుద్దంగా సాగుతున్న అక్రమాల గురించి చూపించబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది.
యశోద సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించబోతుంది. గర్భవతిగానే సమంత చేసే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. చాలా రియలిస్టిక్ గా సమంత యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తాజాగా తెగ ప్రచారం జరుగుతుంది.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ ఈ సినిమా కి స్టంట్స్ అందించాడు.మొత్తానికి సమంత మయో సైటిస్ తో బాధపడుతున్న ఈ సమయంలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సమంతకు ఈ సినిమా సక్సెస్ అయితే మానసికంగా బలం చేకూరుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరి యశోద ఫలితం ఏంటో తెలియాలంటే నవంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.
బాలయ్య మరోసారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా…!
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా హీరోగానే సినిమాలు చేస్తున్నారు తప్ప కొత్తగా ప్రయత్నించాలి అనుకోలేదు. ఒక్క సారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా కోసం మాత్రం చిన్న గెస్ట్ రోల్ ను పోషించాడు.
ఆ తర్వాత అంతకు ముందు పూర్తిగా హీరోగానే ఆ సినిమాలు చేశాడు.ఇప్పుడు మరోసారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా తరహా లోనే బాలయ్య గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.
తనకు సింహా.. లెజెండ్.. అఖండ వంటి భారీ విజయాలను అందించిన బోయపాటి అడగడం తో కాదనలేక గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కీలకమైన గెస్ట్ పాత్రలో బాలయ్య ను చూపించబోతున్నారట.
బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగానే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.రామ్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఇక అఖండ సినిమా తర్వాత బోయపాటి నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగా మెరుగులు హంగులు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే రామ్ సినిమాలో బాలయ్య విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఇటీవలే పరశురామ్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్య సినిమా కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా బోయపాటి కోసం రామ్ సినిమాలో గెస్ట్ రోల్ కి బాలయ్య ఓకే చెప్పాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.