లోకేష్ సవాల్ కి కొడాలి నాని రియాక్షన్

kodali nani on today given strong reply to tdp leader nara lokeshs challenge to ys jagan

AP :లోకేష్ సవాల్ కి కొడాలి నాని రియాక్షన్

ఆంద్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి  కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  ఓ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలపై పోటీకి సంబంధించి నారా లోకేష్ విసిరిన సవాల్ పై వైఎస్ జగన్ స్పందించలేదు కానీ.వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. లోకేష్ ను ఉద్దేశించి ఎప్పటిలాగే కొడాలి నాని ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఇప్పుడు లోకేష్ సవాల్, దానికి కొడాలి నాని కౌంటర్ చర్చనీయాంశమవుతున్నాయి.

కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని, వైసీపీ గెలవని చోట గెలిచే సత్తా ఉందా అంటూ నారా లోకేష్ వైఎస్ జగన్ కు తాజాగా పాదయాత్రలో సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు.

వైఎస్ జగన్ కు లోకేష్ సవాళ్లు విసరడాన్ని తప్పుబట్టిన కొడాలి నాని ఆయనకు మరో సవాల్ విసిరారు. అదీ వైసీపీకి పోటీగా యువగళం సభ పెట్టాలని సవాల్ చేశారు.

175 నియోజక వర్గాల్లో ఎక్కడైనా,వైసీపీకి పోటీగా లోకేష్ యువగళం సభ పెట్టాలని కొడాలి నాని సవాల్ విసిరిరారు. లోకేష్ యువగళంకు పోటీగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పంపుతామన్నారు. యువగళం సభ కంటే, సిద్ధార్థ రెడ్డి సభకు పదిరెట్లు యువత రాకుంటే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్నారు. జగన్ పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయాయిన అసమర్థుడు,ఆయనకే చాలెంజ్ చేసే అంత సత్తా వుందా నీకు అని ప్రశ్నించారు. 151మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగనెక్కడా,వార్డు మెంబర్ గా గెలవని లోకేష్ స్థాయి ఏంటని నిలదీశారు. పప్పులో పనికొచ్చే ప్రోటీన్ ఉంటుంది లోకేష్ పప్పు కాదు ఎందుకు పనికిరాని పిప్పితో సమానం అంటూ కొడాలి మరోసారి రెచ్చిపోయారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh