హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి

Hindu Temple Muslim Couple Marriage

marriage :హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి

హిందూ  ముస్లిం అనగానే ఠక్కున నెగెటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి . కానీ హిందూ-ముస్లిం ఐక్యతను మరోసారి చాటిచెప్పిన ఘటన ఇది. హిందూ ఆలయంలో ఓ ముస్లిం జంట వివాహం చేసుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా రామ్‌పూర్ హిందూ ఆలయంలో ఈ వివాహం జరిగింది. గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. పేద కుటుంబం కావటంతో పెళ్లి వేడుకకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని నిర్ణయించారు.

అయితే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్వంలోని ఠాకూర్ సత్యన్నారాయణ ఆలయంలోనే  వివాహం జరిగింది. అంతేకాదు ఈ వివాహా వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహం మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలోనే పెళ్లి జరిగింది. మతసామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రజలకు తెలియజేయడమే ఆలయ ప్రాంగణంలో వివాహం ముఖ్య ఉద్దేశం.

సత్యన్నారాయణ ఆలయ సముదాయం విశ్వహిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా కార్యాలయం కావడం గమనార్హం. ఠాకూర్ సత్యన్నారాయణ ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ వినయ్ శర్మ మాట్లాడుతూ ‘ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ చూస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా కార్యాలయం కూడా ఇదే విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌లు తరచూ ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ముస్లిం జంట హిందూ దేవాలయ ఆవరణలో పెళ్లి చేసుకున్నారు. సనాతన ధర్మం ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని చెప్పారు.

వధువు తండ్రి మహేంద్ర సింగ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘రాంపూర్‌లోని సత్యనారాయణ ఆలయ ప్రాంగణంలో కుమార్తె వివాహం జరిగింది. విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్, స్థానికులు ఎంతో అండగా నిలిచారు. దగ్గరుండి పెళ్లిని నడిపించారంటూ అభినందనలు తెలిపారు. దీంతో రాంపూర్ వాసులు ప్రజల మధ్య సోదర భావాన్ని చాటారు. పరస్పర సౌభ్రాతృత్వం దెబ్బతినేలా ఒకరినొకరు తప్పుదోవ పట్టించకూడదు’’ అని ఆయన అన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన తన కుమార్తె గోల్డ్ మెడలిస్ట్ అని, అబ్బాయి సివిల్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh