KCR : భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
KCR Maharashtra Tour : బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కోసం రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
సోలాపుర్, దారాశివ్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
ప్రగతిభవన్ వద్ద నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్లతో భారీ కాన్వాయ్‌తో సిఎం కేసీఆర్ తరలి వెళ్లారు.కేసీఆర్‌తో పాటు మరి కొందరు ముఖ్యనేతలు బస్సులో ప్రయాణిస్తున్నారు.
మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినవారిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత మార్గం మధ్యలోని ఉమెర్గా పట్టణంలో నేతలంతా భోజనాలు చేస్తారు.
అక్కడి నుంచి సోలాపుర్ చేరుకొని రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు పండరిపుర్‌లో ‘శ్రీ విఠల్ రుక్మిణి’ ఆలయాన్ని సీఎం కేసీఆర్, ఇతర ప్రజా ప్రతినిధులు దర్శించుకుంటారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30 గంటలకు పండరిపుర్ మండలం సర్కోలీ గ్రామానికి చేరుకుంటారు.
సర్కోలీ గ్రామంలో ఎన్సీపీకి చెందిన సోలాపుర్ జిల్లా ప్రముఖ నేత భగీరథ్ భాల్కే సహా పలువురు నాయకులు భారతరాష్ట్రసమితిలో చేరనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్కడ భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు మార్గం మధ్యలో 3.30 గంటలకు ఈ క్రమంలో దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
సోలాపూర్‌కు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు.
మంగళవారం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్ తిరుగుపయణం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
అలాగే కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, మహారాష్ట్ర నేత మాణిక్ కదం తదితరులు ఈ ఏర్పాట్లలో
తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ వెంట వెళ్లే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్దేశిత సమయానికి ప్రగతి భవన్ చేరుకోవాలని సమాచారం అందించారు.