CM Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

CM Jagan

CM Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

CM Jagan:  ఆంధ్రప్రదేశ్ లోని యువ న్యాయవాదులకు శుభవార్త. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.

దీనిలో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నేడు ఆ డబ్బు జమ చేశారు సీఎం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రతి నెలకు రూ. 5 వేల చొప్పున అంటే ప్రతి వ్యక్తికి రూ. 25 వేల లెక్కన మొత్తం రూ. 6,12,65,000లను వారి ఖాతాల్లో జమ చేశారు.

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 41.52 కోట్లుకు చేరుతుంది.

అలాగే కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.  వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తోడుగా ఉండేందుకు లా నేస్తం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంటుందని,

అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లునిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నామని చెప్పారు.

మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నామని, దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారని చెప్పారు.

ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునే యువ న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.in ద్వారా గానీ, నేరుగా లా సెక్రటరీకి గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే యువ న్యాయవాదులకు ఆర్ధిక సాయం చేసే ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు.

కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని, ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశామని చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh