Lady Singham: రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ మృతి

Lady Singham: రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ మృతి

Lady Singham: అస్సాం పోలీస్ విభాగంలో ‘లేడీ సింగం’గా పేరు తెచ్చుకున్న మహిళా పోలీస్ అధికారి జున్‌మోనీ రాభా(Junmoni Rabha) దుర్మరణం పాలయ్యారు.

నాగాన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఆమె జిల్లాలో పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

మోరికొలాంగ్ పోలీస్ ఔట్‌పోస్టు ఇంఛార్జిగా పనిచేస్తున్న ఎస్ఐ జున్‌మోనీ రాభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేటు కారులో ప్రయాణిస్తున్నారు. 2.30 AM గంటలకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్ జఖలబంధా స్టేషన్ పరిధిలోని సురభుగియా గ్రామంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టింది.

Also Watch

AP Politics: టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు బిగ్ షాక్

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమె సివిల్ దూస్తుల్లో ఉందని. అయితే అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఆమె మృతి వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు.మృతురాలి తల్లి సుమిత్రా రభా మీడియాతో మాట్లాడుతూ ఇది ఎవరో గుర్తుతెలియని రాకెట్ ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని ఆరోపించారు.

జున్మోనీ అత్త సుబర్నా బోడోతో కలిసి ఆమె ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మాట్లాడి ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ‘పూర్తిగా సృష్టించిన’ ప్రమాదానికి కారణమైన నిందితులను శిక్షించడం ద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

జన్మోనీ రాభా నాగాన్ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వర్తించేవారు. విధుల్లో చాలా కఠినంగా వ్యవహరించేవారు. తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో లేడీ సింగం, దబాంగ్ పోలీస్‌గా పేరు తెచ్చుకున్నారు.

మరోవైపు, పలువు వివాదాల్లోనూ ఆమె చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై గత జూన్ నెలలో ఆమె అరెస్టయ్యారు.

కొంత కాలంపాటు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. ఓ బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె సంభాషణ కూడా వివాదాస్పదమైంది

కాగా, నార్త్ లఖింపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం మరణించిన ఎస్ ఐపై సోమవారం ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అస్సాం డిజిపి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh