NTR 100 Year Celebrations: అట్టహాసంగా వేడుకలు..

NTR 100 Year Celebrations

NTR 100 Year Celebrations: అట్టహాసంగా వేడుకలు.. ముఖ్య అతిథిగా రజనీకాంత్

NTR 100 Year Celebrations: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాలు, అందులోని పలు పాత్రలు తెలుగు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. కెరీర్ లో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుని అన్నగా ప్రేక్షకాభిమానుల మనసులో ముద్రవేసిన ఎన్టీఆర్, ఆ తరువాత టిడిపి పార్టీ నెలకొల్పి ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసారు. ఇక ఆ  శతజయంతి వేడుకని నేడు విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు.

ఆయన శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో సూపర్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకాగా  ఇందుకోసం ఆయన చెన్నై నుంచి గన్నవరంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు రజనీకాంత్‌కు నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్, బాలకృష్ణలు ఎయిర్ పోర్టుకు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు   గెలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా రజనీకాంత్  హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడన్నారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

అట్టహాసంగా వేడుకలు.. ముఖ్య అతిథిగా రజనీకాంత్

ఐటీ గురించి ఎవరూ ఆలోచించని రోజుల్లోనే ఐటీని ప్రోత్సహించారన్నారు. ఇటవల తాను హైదరాబాద్  వెళ్లానని..  న్యూయార్క్ లో ఉన్నానా.. హైదరాబాద్‌లో ఉన్నానా అన్న అనుమానం వచ్చిందన్నారు. సైబరాాబద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఈ సభను చూస్తూంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది కానీ.. వద్దని తన అనుభవం చెబుతోందని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందన్నరు. చంద్రబాబు విజన్ గురించి దేశంలో ఉన్న పెద్ద నాయకులందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ తన మిత్రుడు, కంటిచూపుతోనే చంపేస్తాడు.. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌, అమితాబ్‌, నేను చేసినా జనం ఒప్పుకోరని రజనీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పుడు 2047 విజన్  ప్లాన్ చేసుకున్నారని ఆయన ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నానన్నారు.

NTR 100 Year Celebrations సందర్బంగా ఎన్.టి.రామారావు  తో వున్నా తన అనుబంధాన్ని రజినీకాంత్ గుర్తుచేసుకున్నారు. తన బాల్యంలో ఎన్టీఆర్ పాతాళాభారవి ఎన్నోసార్లు చూశానని, అలానే అందులో భైరవి పేరు, ఆ విగ్రహం తన మదిలో అలా గుర్తుండిపోయిందని అన్నారు. హీరోగా తాను చేసిన ఫస్ట్ మూవీకి భైరవి అనే టైటిల్ పెట్టడం నిజంగా తన అదృష్టం అన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన లవకుశ, శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ అలానే మరికొన్ని సినిమాలు తాను అనేకసార్లు చూశానని తెలిపారు. తొలిసారిగా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో కలిసి టైగర్ మూవీలో వర్క్ చేసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని, దాని తరువాత తనకి నటుడిగా మరిన్ని అవకాశాలు వచ్చాయని తెలిపారు.

ఇక తాను కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టి అత్యధిక మెజార్టీతో గెలవడం తనకు అమితానందాన్ని అందించిందని, అటువంటి మహనీయుడు, యుగపురుషుడిని ఎన్ని సంవత్సరాలైనా మనం ఎప్పటికీ మరచిపోలేము అని అన్నారు. ఇక తనను ఈ వేడుక కి ప్రత్యేకంగా ఆహ్వానించిన బాలకృష్ణ, చంద్రబాబు లకు ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలిపారు రజినీకాంత్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh