ఆస్ట్రేలియాలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

Kavita's birthday celebrations in Australia

Kavitha Birthday Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ఉద్యమం ఊపిరిగా సాగిన రోజుల్లో జన జాగృతి కోసం ఆమె ఎంచుకున్న మార్గం సాంస్కృతిక చైతన్యం. తెలంగాణకు సొంతమైన బతుకమ్మ పండుగ సంబరాలకు ఉద్యమాన్ని జోడించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించారు  కవిత తెలంగాణ జాగృతి వేదికగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ కవిత జన్మదిన పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో నిర్వహించిన సామూహిక రక్తదాన శిభిరానికి భారీ స్పందన లభించింది. ఈ మధ్య కాలంలో ఇదే అతి పెద్ద సామూహిక రక్తదాన కార్యక్రమాన్ని, అందుకు టిఆర్ ఎస్ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించారు.

అనంతరం, కవిత గారి దీర్ఘాఆయుష్షు కోసం శివ విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు . సాయంత్రం పాయింట్ కుక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, శ్రీమతి కవిత గారి ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకుందన్నారు.

అలాగే వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు, టి ఆర్ఎస్ పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో తెలియజెప్పడానికి విశేష కృషినందిస్తుందనీ, తమకీ అవకాశం కల్పించిన కవిత అక్క గారికి సదా కృతజ్ఞులమని తెలిపారు. బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
మెల్బోర్న్ లో జరిగిన వేడుకలలో ముఖ్య నాయకులు డా అనిల్ రావు , రాజేష్ రాపోలు , మాధవ్ కటికనేని , సత్యం రావు, అమర్ రావు,సునీల్ రెడ్డి,వరుణ్ నల్లెల్ల ,ప్రకాష్ సూరపనేని , వెంకట్ చెరుకూరి, ఉదయ్ కల్వకుంట్ల ,డా అర్జున్ , క్రాంతి రెడ్డి,హేమంత్ , రవిశంకర్ రెడ్డి, సాయి యాదవ్ ,రాకేష్ గుప్త,వేణు నాథ్ ,కిరణ్ పాల్వాయి , శ్రీనివాస్ కర్ర , ప్రవీణ్ దేశం , సతీష్ పాటి , పుల్ల రెడ్డి బద్దం , తెలంగాణ మధు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh