తెలంగాణ మంత్రివర్గం అలీ బాబా 40 దొంగల ముఠాలాగా ఉంది – తరుణ్ చుగ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. హన్మకొండ మెజిస్ట్రేట్ ఇచ్చిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏప్రిల్ 10న విచారిస్తామని, కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలంగాణ హైకోర్టు చెప్పిన మరుసటి రోజే ఆయన విడుదలయ్యారు.

బెయిల్ పై విదులైన్ బండి సంజయ్  కుటుంబాన్ని కరీంనగర్‌లో పరామర్శించరు తరుణ్ చుగ్. తర్వాత వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు కేసీఆర్ (KCR)  చేతిలో తోలుబొమ్మల మాదిరిగా మారారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ చేశారని. న్యాయస్థానాలు అహంకార ప్రభుత్వానికి చెంప పెట్టు తీర్పు ఇచ్చాయని అన్నారు. ఈ తీర్పుతో నిజాయితీ, ధర్మం గెలిచిందని ఆయన అన్నారు.  పార్లమెంట్ సభ్యునికే నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేస్తే సామాన్య జనం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చని అన్నారు.

కానీ తెలంగాణ  ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై ఆక్రోషంతో ఉన్నారని వారిని ఎప్పుడు జైలుకు పంపాలన్నంత కోపంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబం రాజ్యం 5 నెలలు మాత్రమే నడుస్తుందని తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ జంగిల్ రాజ్ సర్కార్ నడుస్తుందని, మంత్రివర్గం అలీ బాబా 40 దొంగల ముఠాలాగా ఉందని విమర్శించారు. బండి సంజయ్ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారని టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.

కాగా బండి సంజయ్ అరెస్ట్‌నుబీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ ఖండించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, రాజకీయంగా ఆ పార్టీ సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.దిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. “కొంత కాలంగా తెలంగాణలో లీకేజీలు, ప్యాకేజీల వ్యవహారం నడుస్తోంది. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు’’అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో దీన్ని ఎదుర్కొంటామని లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌పై పార్లమెంట్ హక్కుల కమిటీకి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఫిర్యాదు చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh