రేపు జనసేన సభకు పోలీసులు షాక్

Police shocked at Jana Sena meeting tomorrow 

janasena Avir bhava Sabha: రేపు జనసేన సభకు పోలీసులు షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంద్రప్రదేశ్ లో చాలా బిజీ షెడ్యూల్  గడుపుతున్నారు. అయితే ఒక వైపు  కాపు, మరొకవైపు  బీసీ నేతలతో జనసేన నాయకుడు వరుస సమావేశాలు నిర్వహించారు.అలాగే  జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రేపు ‘ఛలో మచిలీపట్నం’ పేరుతో బహిరంగ సభ నిర్ణహించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.అయితే ఈ నేపద్యం లో జనసేనకు పోలీసులు షాకిచ్చారు . ఒకవేళ అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కాగా జనసేన ఆవిర్భావ సభ వేళ పోలీసుల ఆంక్షలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు  ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. రేపటి ఛలో మచిలీపట్నం సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు, నాయకులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే   సభలో పవన్ ఏమి మాట్లాడుతారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. గత ఏడాది ఆవిర్భావ సభలో పవన్ వైసీపీ సర్కార్ కి అల్టిమేటం జారీ చేశారు. వైసీపీకి యాంటీగా అన్ని పార్టీలను కూడగట్టి ముందుకు వస్తామని ప్రకటించారు. వైసీపీని గద్దె దించడమే జనసేన టార్గెట్ అని స్పష్టంగా పవన్ ప్రకటించారు.

ఆ దిశగా గత ఏడాదిలో జరిగిన ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయో తెలియదు కానీ జనసేన మాత్రం ఈ ఏడాదిలో తెలుగుదేశానికి కాస్తా దగ్గరగా జరిగినట్లుగా సంకేతాలు అయితే కనిపించాయి. అదే టైం లో బీజేపీకి దూరంగా జరిగినట్లుగా కూడా కనిపిస్తోంది. ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో జరుగుతూంటే జనసేన తన మిత్రపక్షం బీజేపీకి మద్దతుగా ప్రకటన ఈ రోజుకీ జారీ చేయకపోవడం విశేషం.

ఈ విధంగా మిత్రబంధంలో అయోమయం కొనసాగుతున్న నేపధ్యంలో జరుగుతున్న జనసేన సభ ఏపీ రాజకీయాల్లో తన పాత్ర మీద మరింత క్లారిటీ ఇచ్చేలా పవన్ స్పీచ్ ఉంటుంది అని అంటున్నారు. ఇక మరోవైపు చూస్తే తెలుగుదేశంతో జనసేన సంబంధాల మీద కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పెద్దన్న తరహాలో కూటమిలో ఉంటూ మిత్రులను కలుపుకోవడం ఇంతవరకూ వస్తున్న పద్ధతి. అయితే తమకు కూడా అధికారిక వాటా కావాలన్నది జనసేన ఆలోచన. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నదే జనసేన నేతల  మాటగా ఉంది. తమకు ఒకటో రెండో మంత్రి పదవులు కాదు ముఖ్యమంత్రి పదవి కావాలన్నది ఆ పార్టీ వారి నుంచి వస్తున్న డిమాండ్. అంతే కాదు ఆ సామాజిక వర్గం నుంచి కూడా అదే రకమైన డిమాండ్ వస్తోంది.

ఇక జనసేన సభ జరుగుతున్న నేపధ్యంలోనే అటు తెలుగుదేశం పార్టీ కూడా దూకుడు పెంచింది.  పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను నేరుగా తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కలిపేసుకుంటోంది. ఇక జనసేన సభ జరుగుతున్న నేపధ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా దూకుడు పెంచింది. ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను నేరుగా తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కలిపేసుకుంటోంది.  మరొక వైపు  పవన్ కళ్యాణ్ అంటేనే కౌంటర్ మీద  కౌంటర్ ఇచ్చే పేర్ని నాని నియోజక వర్గం లో జనసేన ఆవిర్భావ సభ జరగడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh