Kalki -2898 AD Releasing On 27th June

Prabhas Kalki Release Confusion Nag Aswin

Kalki -2898 AD Releasing On 27th June

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా “కల్కి 2898 ఏడీ” సినిమా విడుదల కానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటీని కలిగిస్తున్నారు మేకర్స్.

మన పురాణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూడటానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “కల్కి” ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

బెనిఫిట్ షోతోపాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. తాజాగా, ఏపీ ప్రభుత్వం కూడా కల్కి మేకర్లకు శుభవార్త అందించింది.

ఏపీ ప్రభుత్వం “కల్కి” సినిమా టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయలు,

మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. అలాగే, రోజుకు 5 షోలు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేసింది కల్కి టీం.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ “కల్కి” స్టోరీ రివీల్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తున్నారు. మరోవైపు, “థీమ్ ఆఫ్ కల్కి” పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది కల్కి టీం.

ఇందులో నటి శోభనతోపాటు పలువురు నాట్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ షేర్ చేసింది.

అమితాబ్, దీపికా, దిశా పాటనీ, కమల్ హాసన్, శోభన కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈశ్వర్ నుంచి కల్కి వరకు…

తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ కి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈశ్వర్ మూవీ తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రభాస్ ఎన్నో సుపర్ హిట్స్ అందుకున్నాడు

డార్లింగ్ మూవీ తో డార్లింగ్ ప్రభాస్ గా మారిపోయాడు ఆ తర్వాత రెబల్ సినిమా తో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు

జూన్ 27 న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీస్ అవ్వబోతోంది. అయితే ఈ సినిమా గురించి డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడైయ్యాయి.

అయితే కల్కి మూవీ రిసల్ట్ గురించి రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Kalki -2898 AD | Releasing On 27th June 2024

Prabhas' Kalki 2898 AD: early shows and record ticket prices

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh