ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సమంత

samantha latest post

ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సమంత

సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఫ్యాన్స్ సంతోషపడే  గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో సమంతకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. హీరోయిన్ సమంత తిరిగి సినిమాలతో బిజీ కానుందని గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. 2022 అక్టోబర్ నెలలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత. కొన్ని నెలలపాటు రెస్ట్ తీసుకొని  సమంత తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ ప్రారంభమైంది. ముంబైలో ఈ యాక్షన్ సిరీస్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే సిటాడెల్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ ప్రైజ్ ఒరిజినల్ సిరీస్ గా భారీ బడ్జెట్ తో సిటాడెల్ నిర్మిస్తున్నారు.

ముంబై షెడ్యూల్ అనంతరం నార్త్ ఇండియాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అనంతరం ఫారిన్ షెడ్యూల్ ఉంది. సౌత్ ఆఫ్రికాతో పాటు రెండు మూడు దేశాల్లో చిత్రీకరణ జరుపనున్నారు. ఈ మేరకు టీం అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సోషల్ మీడియా ప్రకటన చేశారు. త్వరలో ఖుషి షూట్ తిరిగి ప్రారంభం కానుందని వెల్లడించారు.

సమంత మరలా షూటింగ్స్ లో పాల్గొంటున్నప్పటికీ స్పష్టమైన ప్రకటన లేదు. ఎట్టకేలకు సమంత దీనిపై క్లారిటీ ఇచ్చారు. 7-8 నెలల స్ట్రగుల్ అనంతరం కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పారు. బెడ్ పై సైలెన్స్ తో పడుకున్న స్టేజి నుండి యాక్షన్ వెబ్ సిరీస్లో నటించే స్టేజ్ కి చేరానని చెప్పకనే చెప్పారు. సిటాడెల్ టీమ్ తో చర్చల్లో ఉన్న ఫోటోలతో పాటు ఆసక్తికర ఇమేజ్ ల ద్వారా వివరించారు.

ఒక దశలో తనని తాను కోల్పోయానని, మనోధైర్యంతో ఎదిరించి నిలబడ్డానని ఆమె సందేశం పోస్ట్ చేశారు. సమంత మయో సైటిస్ నుండి కోలుకున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతున్న తరుణంలో ఫ్యాన్స్ ఆనందం అవధులు లేవు.ఫ్యాన్స్ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన శాకుంతలం పోస్టపోన్ అయింది. ఇలాగే గతంలో కూడా ఒకసారి శాకుంతలం వాయిదా వేశారు. రెండోసారి కూడా వాయిదా పడిన నేపథ్యంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh