రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత లా పెళ్లి కి ముఖ్య అతిధులుగా రోజా దంపతులు

jabardasth rakesh and jordar sujatha

రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత లా పెళ్లి కి ముఖ్య అతిధులుగా రోజా దంపతులు

జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ రాకింగ్ రాకేష్‌, బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్‌ జోర్దార్‌ సుజాత వివాహం చేసుకున్నారు. ఈ కామెడీ ఆర్టిస్టుల వివాహానికి ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి విచ్చేశారు సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకల్లో మంత్రి ఆర్కే రోజా దంపతులు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. నూతన వధువరులను దగ్గరుండి ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈఫోటోలను మంత్రి ఆర్కే రోజా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. తనకు అత్యంత ఆప్తులు తనను అమ్మా అని పిలిచే బబర్దస్త్ రాకేష్, జోర్దార్‌ సుజాతల సుఖ జీవనానికి హేతువైన మంగళ సూత్రంతో మాంగల్యాన్ని సుజాత మెడలో కట్టిన శుభగడియలో ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని కోరుతున్నానని రోజా కామెంట్ పోస్ట్ చేశారు.

ఈ రోజు శుక్రవారం తెల్లవారు జామున తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌లుగా మంత్రి దంపతులు హాజరవగా పెళ్లి పెద్దలుగా సుజాత తల్లిదండ్రులు, రాకేష్‌ తల్లి వ్యవహరించారు. జబర్దస్త్ ఆర్టిస్టులు కొందరు ఈ వెడ్డింగ్‌కు అటెండై శుభాకాంక్షలు తెలిపారు.  జోర్దార్ వార్తల యాంకర్‌గా బాగా ఫేమస్ అయిన సుజాత ఫేంతో బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో మరింత పాపులర్ అయింది. అటు కామెడీ షో జబర్దస్త్‌లో ఆర్టిస్ట్‌గా పరిచయమైన రాకేష్ తర్వాత టీం లీడర్‌గా మారాడు. ఇద్దరూ టీవీ షోలతో మంచి స్నేహితులుగా మారారు వీళ్లిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆక్రమంలోనే ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీవీ షోల్లో కూడా పండుగలు, స్పెషల్ ప్రోగ్రామ్‌లో పెళ్లి సంబురాలు చేసుకోవడం, వీరిని రోజా స్వాగతించడంతో ఇద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో భాగస్వాములయ్యారు. రాకేష్‌, సుజాత పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.టీవీ ఆర్టిస్టులుగా వేర్వేరుగా కెరియర్ స్టార్ట్ చేసిన ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే ఈ పెళ్లి ఫోటోలను కూడా కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి చేసుకున్న జంటను దంపతులు కలిసి ఆశీర్వదిస్తారు. మీరేంటో నీ విధానాలు ఏంటో అంటూ ఓ నెటిజన్ కాంట్రవర్సీ కామెంట్ చేశాడు. రాకేష్, సుజాత పెళ్లి ఫోటోల్లో మంత్రి ఆర్కే రోజా, సెల్వమణి కలిసి దీవిస్తున్న ఫోటోల్లో ఇద్దరూ కలిసి లేకపోవడం వల్లే నెటిజన్లు ఈవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి రోజా ఈ మధ్య కాలంలో ఏం చేసినా వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh