మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్

Arvind Kejriwal connived with Delhi liquor scam accused

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్:

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయని, వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతల పేర్లు కూడా ప్రస్తావించారు. గత నెలలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో నేరుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ప్రస్తావించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తక్కళ్లపల్లి లుపిన్‌, అరుణ్‌పిళ్లై, బుచ్చిబాబు, గౌతం ముత్తా, అభిషేక్‌ బోయినపల్లి, చందన్‌రెడ్డి, నరసింహారావు, నరేందర్‌రెడ్డి, భాస్కర్‌ వెనిశెట్టి, ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీనివాసరావు, అరవ గోపీకృష్ణ సహా 65 మందిని విచారించిన ఈడీ 428 పేజీలతో కూడిన ఫిర్యాదు నివేదికను సమర్పించింది. దీన్ని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు గురువారం పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

ఢిల్లీ నూతన మద్యం పాలసీలో ఆప్ నేత విజయ్‌నాయర్‌ కీలకంగా వ్యవహరించినట్లు సమీర్ మహేంద్రు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని, ఈ పాలసీని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మానసపుత్రికగా విజయ్‌ అభివర్ణించినట్లు ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కేజ్రీవాల్‌తో సమావేశానికి తాను రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని. తర్వాత ఆయనకు సన్నిహితుడైన ఒక సహాయకుడు తన ఐఫోన్‌ నుంచి ఫేస్‌టైమ్‌ కాలింగ్‌ యాప్‌ ద్వారా సీఎంతో తనను మాట్లాడించినట్లు సమీర్‌ వెల్లడించాడని తెలిపింది. ‘‘ఆ సహాయకుడు ‘తన మనిషి’ అని, అతడిని విశ్వసించవచ్చని కేజ్రీవాల్ చెప్పినట్లు సమీర్‌ వాంగ్మూలమిచ్చాడు.

కాగా, మద్యం కుంభకోణంలో వచ్చిన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని గతేడాది గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వినియోగించినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. అక్కడ ఎన్నికల సర్వేలో పాల్గొన్న వాలంటీర్లకు రూ.70 లక్షల నగదు పంపిణీ చేశారని, ప్రచారంలో భాగంగా ప్రకటనలు, హోర్డింగులకు వెచ్చించిన సొమ్ములో అధికశాతం హవాలా మార్గంలో నగదు రూపంలో చెల్లించారని అభియోగం మోపింది.
ఢిల్లీ మద్యం పాలసీలో సౌత్‌గ్రూప్ ప్రవేశం, కేజ్రీవాల్‌, కవిత, మాగుంట పాత్రల గురించి ఈడీ ప్రస్తావించింది. సౌత్‌గ్రూపులో అసలు వాటాదారుల గురించి కచ్చితంగా చెప్పాలని అరుణ్‌పిళ్లైని సమీర్‌ అడిగినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత పేరు చెప్పి, ఆమె తరఫున మాత్రమే తాను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారని ఈడీ పేర్కొంది.

2021 సెప్టెంబరులో ఢిల్లీ తాజ్‌మాన్‌సింగ్‌లో కలుసుకున్నారని, తర్వాత కొన్ని రోజులకు అరుణ్‌ తన ఫోన్‌ ద్వారా కవితను ఫేస్‌టైమ్‌లో సమీర్‌తో మాట్లాడించిట్టు తెలిపింది. వ్యాపారంలో తమ భాగస్వాములైనందుకు సమీర్‌ను కవిత అభినందించారని, అలాగే కొన్ని ఫిర్యాదులతో ఇండోస్పిరిట్‌ దరఖాస్తు నిలిచిపోయిన సందర్భంలోనూ సమీర్‌తో కవిత ఫేస్‌టైమ్‌లో మాట్లాడారని చెప్పింది.‘‘గతేడాది ప్రారంభంలో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో జరిగిన సమావేశంలో సమీర్, శరత్‌, అరుణ్‌పిళ్లై, అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నారు.. అరుణ్‌ తమ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయనతో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత సమీర్‌కు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. శరత్‌ చంద్రారెడ్డి 5 మాగుంట 2 జోన్లలో మద్యం వ్యాపారం నిర్వహించారు. ఇండోస్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టినా. దాని ద్వారా లాభాల్లో భాగంగా రూ.17 కోట్లు ఆర్జించింది’’ అని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh