Kali Matha: హిందువుల మనోభావాలపై దాడి
Kali Matha: ఉక్రెయిన్ దేశ రక్షణ శాఖ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరాధ్య దైవమైన ‘కాళీ మాత’ను అగౌరవపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసి భారతీయుల ఆగ్రహానికి గురైంది. పెద్ద ఎత్తున భారతీయుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ విభాగం. అయితే, హిందువుల మనోభావాలను గాయపర్చి ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంపై భారతీయులు మండిపడుతున్నారు.
కాగా, రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన ఓ పొగపై కాళీ మాతను తలపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫొటోను ట్వీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో స్టర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఈ చిత్రాలు చూపిస్తున్నాయని కంచన్ గుప్తా అన్నారు. 2022 ఫిబ్రవరిలో కైవ్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశాన్ని సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి ఉక్రెయిన్ అధికారి ఆమె. దేశం చేయని విధంగా ఉక్రెయిన్ కాళీమాతను అపహాస్యం చేసిందని గుప్తా అన్నారు. ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ చర్యలను “సిగ్గుమాలిన విద్వేషపూరిత ప్రసంగం” గా ఆయన అభివర్ణించారు.
ఈ Kali Matha ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా, రష్యాపై జరుగుతున్న యుద్ధానికి సహాయం కోరిన తర్వాత ఉక్రెయిన్ భారత్ ను అవమానించిందని పలువురు మంత్రిత్వ శాఖపై మండిపడుతున్నారు. ‘@DefenceU (ఉక్రెయిన్ డిఫెన్స్) కాళీమాతను హేళన చేస్తూ అసభ్యకరమైన వర్ణనతో అవమానకరంగా ప్రవర్తించారు. ఉక్రెయిన్ కు భారత్ సాయం అందించిందని, వాటిని ఈ విధంగా తిరిగి చెల్లిస్తామన్నారు. హిందువులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు’ అని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.మరో యూజర్ రక్షణ మంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘షాకింగ్! ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక హ్యాండిల్ కాళీమాతను కించపరిచే భంగిమలో చిత్రీకరిస్తోంది. ఇది కళాకృతి కాదు. మా విశ్వాసం జోక్ కాదు. దాన్ని తీసివేసి @DefenceU క్షమాపణలు చెప్పండి’ అని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరి నుంచి రష్యాతో యుద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వివాదంలో భారత్ ఏ పక్షాన్నీ తీసుకోలేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్చలకు పిలుపునిచ్చింది.
Recently #Ukraine Dy Foreign Minister was in Delhi soliciting support from #India
Behind that fakery lurks the real face of Ukraine Govt. Indian goddess Ma Kali has been caricatured on a propaganda poster.
This is an assault on Hindu sentiments around the world.@UkrembInd https://t.co/r84YlsUtZc pic.twitter.com/q7jSG0vGXH— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) April 30, 2023