Manobala: ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

Manobala

Manobala: ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

Manobala: ప్రముఖ నటుడిగా, అసిస్టెంట్గా డైరెక్టర్  గా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా ఇలా ఎన్నో రంగాలలో తన ప్రతిభ చాటిన ప్రముఖ కమెడియన్  మనోబాల ఈరోజు ఉదయం అనారోగ్య సమస్యలతో తన నివాసంలో తుది శ్వాస విడిచారు.  గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. లివర్ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన  జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు. ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది మనోబాల మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Watch This:

AP Government: చంద్రబాబుకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన మనోబాల  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.  తెలుగులో మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి కామెడీ పండించారు మనోబాల. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు మనోబాల.

1970 సంవత్సర ప్రారంభంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత కమలహాసన్ సహాయంతో భారతీరాజా దగ్గర 1979లో పుతియా వార్పుగల్ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత నటుడిగా మారి కొన్ని పదుల సంఖ్యలో చిత్రాలలో నటించిన ఆయన దర్శకుడిగా కూడా అన్నే చిత్రాలకు దర్శకత్వం వహించారు.  ఇక నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు. అంతేకాదు సన్ టివి ,పాలిమర్ టీవీలలో ప్రసారం అయిన సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు .

1999లో వచ్చిన పంచవర్ణం అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయమైన మనోభాల 2000లో పున్నాగై అనే సీరియల్ లో కూడా నటించాడు. ఇక 2019లో మృగరాజు సినిమాలో జాజు పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. ఇకల ఎన్నో చిత్రాలలో నటించి అంతకుమించి పేరు సంపాదించుకున్న కమెడియన్ మనోభాల ఈరోజు తుది శ్వాస విడవడం అందర్నీ మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఆయన మరణానికి పలువురు సినీ సెలబ్రిటీలు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh