NTR కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్, ఫుల్ కిక్ లో ఫ్యాన్స్ 

NTR కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్, ఫుల్ కిక్ లో ఫ్యాన్స్

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తన నటన, డైలాగ్ డెలివరీతోనే కాకుండా సినిమా సినిమాకు ఎప్పటికప్పుడు ట్రెండీగా లుక్స్ మారుస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో కలసి చేస్తోన్న ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) కు సంబంధించి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన ఎన్టీఆర్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే…

ఇటీవల ఎన్టీఆర్ న్యూ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటో ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉంది. ‘ఏ న్యూ డే, న్యూ వైబ్’ అంటూ క్యాప్షన్ కూడా రాశారు ఎన్టీఆర్. దీంతో ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.అభిమానుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పుటికపుడు కొత్త లుక్ లో కనిపించే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల జపాన్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ లో ట్రెండీ కనిపించడమే కాకుండా జపనీస్ భాషలో మాట్లాడి ఔరా అనిపించారు. తాజాగా కొత్త లుక్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ కొత్త లుక్ లో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్‌ తో జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో తారక్ కొత్త సినిమాకు సంబంధించిన ఫోటోనే అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. సినిమా నిలిచిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ సినిమా పై క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్.

ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక కొత్త లుక్ లో చూపించారు కొరటాల శివ. ఆ సినిమా తర్వాత వారిద్దరి కాంబో లో వస్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్. వీలైనంత త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూస్ లుక్ కొత్త సినిమా కు సంబంధించిందా లేదా ఏదైనా యాడ్ కు సంబంధించిన ఫోటో నా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ఎన్టీఆర్ న్యూ లుక్ మాత్రం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నిపిందనే చెప్పాలి.

మరో వైపు ఎన్టీఆర్ కొత్త లుక్ గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది . బాద్‌షా గెటప్‌ను గుర్తు చేసేలా ఈ లుక్ వెనుక సీక్రెట్ ఇదేనంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఓ ప్రముఖ బ్రాండ్ కమర్షియల్ యాడ్ కోసమే ఎన్టీఆర్ ఇలా మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.
ఈ కమర్షియల్ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కోట్ల రూపాయలు చార్జ్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని టాక్. ఈ యాడ్ కోసం సదరు సంస్థ భారీ సెట్టింగ్స్ కూడా వేసిందని అంటున్నారు.ఏదిఏమైనా ఎన్టీఆర్ లుక్ మాత్రం నందమూరి అభిమానులకు యమ కిక్కిచ్చింది. మరి సినిమా కోసమా లేక యాడ్ కోసమా ఈ లుక్? అసలు నిజం ఏంటనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే మరి.

టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో: పవన్ డైరెక్టర్‌తో బాలయ్య..

టాలీవుడ్‌లో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పద్దతిని ఫాలో అవుతోన్న ఆయన.. ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? అంటే.

ప్రెసెంట్ అన్ స్టాపబుల్ షో తో అరాచకం సృష్టిస్తున్నారు మన బాలయ్య.. దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న బాలయ్య.. ‘Unstoppable with NBK’ షోతో హోస్టుగా మారారు. ఇందులో ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండోది నడుస్తోంది.ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో భారీ ప్రాజెక్టును చేయబోతున్నారని తెలిసింది.నటసింహా నందమూరి బాలకృష్ణతో హరీష్ శంకర్ చేయబోయే సినిమా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుందని కూడా తెలిసింది. ఇప్పటికే ఆ నిర్మాతలు బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ అనే మూవీ చేస్తున్నారు. దీనితో పాటు ఇప్పుడు హరీశ్ శంకర్‌ కాంబోని కూడా సెట్ చేశారు.

ఇక, ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుందని సమాచారం.వాస్తవానికి హరీష్ శంకర్ చాలా రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీని ప్రకటించారు. కానీ, ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో.. ఈ డైరెక్టర్ దాన్ని పక్కన పెట్టేసి బాలయ్యతో జత కడుతున్నాడట. ఇక, ఈ చిత్రాన్ని పోలీస్ స్టోరీతోనే ‘గబ్బర్ సింగ్’ మూవీని మించిపోయేలా రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ..

వివాదాస్పద దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ దూసుకుపోతున్నారు. సినిమాలు తీయడంలో తన రూటే సపరేటు అన్నట్లుగా వెళుతున్న ఆయన.. ఈ మధ్యకాలంలో అడపాదడపా వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.అంతకుముందు తను డైరెక్ట్ చేసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఓ పాత్ర చేసిన వర్మ.. ఆ తర్వాత “పవర్ స్టార్” అనే సినిమాలో కూడా కాసేపు మెరిశారు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే ఆయన హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా ప్రాజెక్టు K లో రామ్ గోపాల్ వర్మ భాగం కాబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.ప్రాజెక్ట్ K లో ఓ చిన్న పాత్ర కోసం ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను సంప్రదించారని, ఈ రోల్ చేసేందుకు ఆర్జీవీ కూడా ఓకే అన్నారని మీడియా వర్గాల సమాచారం. వర్మ త్వరలో తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారని టాక్. తన నిజ జీవిత పాత్రలో వర్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇదే నిజమైతే ప్రాజెక్ట్ K నిర్మాతలు ఎవ్వరూ ఊహించని స్కెచ్చేసినట్లే.

ప్రభాస్ సినిమాలో వర్మ క్యారెక్టర్ పెట్టి ఈ పాన్ వరల్డ్ సినిమా గురించి జనం చర్చించుకునేలా చేయడమే టార్గెట్ పెట్టుకున్నారా? లేక కథ ప్రకారం అలాంటి రోల్ ఒకటి ఉందా అనేది డిస్కషన్ పాయింట్ అయింది.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ K సినిమా రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ వ‌రల్డ్ మూవీ అని ఇప్పటికే నాగ్ అశ్విన్ చెప్పడం ప్రభాస్ అభిమానుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh