ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ ‘నాటు నాటు’ పాటకు లైవ్ షో ఇవ్వనున్న కీరవాణి

keeravani will perform on oscars stage

ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్  ‘నాటు నాటు’ పాటకు  లైవ్ షో  ఇవ్వనున్న కీరవాణి

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా గతేడాది మార్చి లో విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసిందే.ఈ మూవీలో  ఎన్టీఆర్,  రామ్ చరణ్  హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై వరల్డ్ వైడ్ స్టార్స్ ప్రశంసలు గుప్పించారు.    ఈ భారీ సినిమాతో మరోసారి తెలుగోడి సత్తా ఎల్లలు దాటింది. దీంతో ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డుల పంట కూడా పండింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ సహా మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. దీంతో ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. దీనిలోని   నాటు నాటు సాంగ్  ఈ సాంగ్ లోని స్టెప్స్ ప్రపంచ దిగ్గజాల మెప్పును కూడా  పొందాయి. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించారు. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కాల భైరవ ఆలపించారు.  ఇక 95వ ఆస్కార్ అవార్డుల భాగంగా నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఉండనుంది. అక్కడ రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ ఈ పాట పాడనున్నారు. ఏది ఏమైనా ఒక తెలుగు వాడు తెరకెక్కించిన చిత్రం ప్రపంచ సినీ వేదికపై మెరవడం మాములు విషయం కాదనే చెప్పాలి. మన భారతీయులు తెరకెక్కించిన చిత్రం పాట అక్కడ లైవ్ పర్ఫామెన్స్ చేయడం విశేషమనే చెప్పాలి.. అయితే ఇలా ఆస్కార్ వేదికలపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఏ ఆర్ రెహమాన్ ‘జై హో’ పాటను ఇలాగే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.  RRR మూవీ  హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డుల్లో భాగంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది.  బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో RRR ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.  ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ విభాగంలో కూడా మరో అవార్డును గెలుచుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. RRR మూవీ బెస్ట్ స్టంట్స్ విభాగంలో కూడా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. ఇందులో స్టంట్స్ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయ్యాయి. రక్షిత్ కొరియోగ్రఫీ అదిరిపోయింది నిజంగానే ప్రేక్షకులతో నాటు నాటు అనిపించింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1221 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఇక మన దేశంలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ 5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక జపనీస్ భాషల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెగ ప్రమోషన్ చేసారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.  ఈ పాట తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రియులను అలరించింది. దక్షిణ భారత దేశం కాదు  మన దేశం   నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే ప్రథమం ఆర్ ఆర్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌), లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌), ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) ) సినిమాలవి నామినేట్ అయ్యాయి. చూడాలి మరి ఆస్కార్ అవార్డ్ ఏ పాటకు రానుందో ఇక నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ పేర్లను ప్రకటించింది అకాడమీ టీమ్. ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డులలో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బొంబాయి (1988), లగాన్ (2001) చిత్రాలున్నాయి. ఈ అద్భుతమైన సాధించినందుకు ఆర్‌ఆర్‌ఆర్ బృందాన్ని అభినందిస్తున్నారు నెటిజన్స్. ఇక నాటు నాటు మిగితా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా లేదా అనేది మార్చి 13న తెలుస్తుంది. నాటు నాటుతో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్  ది ఎలిఫెంట్ విస్పర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్అ ల్ ది బ్రీత్స్, ఇలా మూడు విభాగాల్లో ఇండియన్ సినిమాలు నామినేట్ అయ్యాయి. ఒకేసారి మూడు భారతీయ చిత్రాలు నామినేట్ కావడం ఇదే మొదటిసారి.

ఇప్పుడు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారనే వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది. కొంతమంది మాత్రం పాట పాడిన సింగర్, డాన్స్ కంపోజర్ లకు కూడా ఇందులో భాగం ఉంది కదా వాళ్లనెందుకు ఆహ్వానించలేదు? ఎప్పుడూ కీరవాణి కుటుంబమే స్టేజి మీద కనబడుతుంది అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. గతంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కార సమయంలో కూడా ఈ కామెంట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ ఆహ్వాన సమయంలో ఆ వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో మున్ముందు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఇక ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. వీరంతా ఓ వారం రోజుల ముందుగానే ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh