JR NTR అప్పటి నుంచి కొడాలి నానితో ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది.

JR NTR అప్పటి నుంచి కొడాలి నానితో ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది.

టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) ఒక‌రు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అన‌తి కాలంలోనే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించే హీరోగా మారారు తార‌క్‌. ఆయ‌న కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమా ఆది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్ ద‌క్కింది.

త‌ర్వాత సింహాద్రితో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు ఎన్టీఆర్‌. తార‌క్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచిన ఆది సినిమాకు ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని  అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. ఆ సినిమాకు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అప్ప‌టి నుంచి తార‌క్‌తో కొడాలి నానికి మంచి అనుబంధం ఏర్ప‌డింది. కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రావ‌టానికి ఓ సంద‌ర్బంలో తార‌క్ రెఫ‌ర్ కూడా చేశార‌నే వార్త‌లు లేక‌పోలేదు. అంత మంచి అనుబంధం ఉన్న వీరిద్దరి మ‌ధ్య రాజ‌కీయాల కార‌ణంగా గ్యాప్ వ‌చ్చింద‌ని అంటున్నారు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌.

రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఎన్టీఆర్‌, కొడాలి నాని మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ..‘‘నేను, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీగారు ఇప్ప‌టికీ క‌లుస్తూనే ఉంటాం. అయితే తార‌క్‌గారితో కొడాలి నాని, వంశీగారికి కాస్త గ్యాప్ వ‌చ్చింది. నేను డీటెయిల్డ్‌గా ఏం జ‌రిగిందని నేను అడ‌గ‌లేదు. కొడాలి నానిగారు వైసీపీలోకి (YCP) వెళ్లే వర‌కు తార‌క్‌కి, నానికి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉండేది.

చ‌క్క‌గా క‌లిసుండేవారు. త‌ను వైసీపీకి వెళ్లిన త‌ర్వాత నుంచి పెద్ద‌గా క‌ల‌వ‌టం లేదు. పార్టీలు, ఫ్యామిలీల‌నేవి ఉంటాయి క‌దా’’ అని అన్నారు డైరెక్టర్ వి.వి.వినాయక్. ఎన్టీఆర్ సైలెంట్‌గా క‌నిపించినా, అత‌నికి ఎవ‌రిని ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసున‌ని ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ చెప్పారు.

2. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.

రీల్ లైఫ్‌లోనే కాదు. మన స్టార్స్ రియ‌ల్ లైఫ్ హీరోల‌మ‌ని కూడా ప‌లు సంద‌ర్భాల్లో నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో స‌త్తా చాటుతున్న మ‌న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. బాగా చ‌దివి జీవితంలో ఉన్న‌త స్థాయికి వెళ్లాల‌నుకుంటున్న మెరిట్ స్టూడెంట్‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు.

ఇక్క‌డ గొప్ప విష‌యమేంటో తెలుసా!.. అల్లు అర్జున్ సాయం చేసిన మెరిట్ స్టూడెంట్ తెలుగు రాష్ట్రాల‌కు చెందినవారు కాదు.. ఆమె కేర‌ళ అమ్మాయి.వివ‌రాల్లోకి వెళితే, కేర‌ళ‌ కు చెందిన ముస్లిం అమ్మాయి. న‌ర్సింగ్  కోర్సు చేయాల‌నుకుంది. ఎగ్జామ్స్‌లో మంచి మార్కుల‌ను కూడా సాధించింది. నాలుగేళ్ల కోర్సు. పేద కుటుంబానికి చెందిన ఆ అమ్మాయికి కోర్సు పూర్తి చేయాలంటే డ‌బ్బులు పెట్ట‌లేని ప‌రిస్థితి.

విష‌యం తెలుసుకున్న అల‌ప్పుర కలెక్ట‌ర్ వి.ఆర్‌.కృష్ణ తేజ త‌న‌ ఫేస్ బుక్ ద్వారా అల్లు అర్జున్‌కి విష‌యాన్ని తెలియ‌జేశారు. స‌ద‌రు అమ్మాయికి ఇంట‌ర్ మీడియ‌ట్‌లో 92 శాతం మార్కులు వ‌చ్చాయి. కానీ పై చ‌దువుకు చ‌దివించే స్థోమ‌త ఆమె కుటుంబానికి లేదు. అందుకు కార‌ణం ఆమె తండ్రి గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా క‌న్నుమూశారు.నర్సు కావాల‌నుకున్న అమ్మాయికి ఓ ప్రైవేటు కాలేజీలో సీటు ద‌క్కింది. కానీ ఆర్థిక ఇబ్బందులున్న స‌మ‌యంలో ఎవ‌రైనా అండ‌గా నిల‌బ‌డితే బావుంటుంద‌ని ఎదురు చూశారు.

దీంతో కలెక్ట‌ర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని సంప్ర‌దించి విష‌యాన్ని తెలియ‌జేశారు. అల్లు అర్జున్‌ వెంట‌నే ఓ ఏడాది కాదు.. నాలుగేళ్ల పాటు అమ్మాయి చ‌దువు, హాస్ట‌ల్ ఫీజుల‌కు కావాల్సిన సాయాన్ని చేయ‌డానికి అంగీక‌రించారు. దీంతో సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా జిల్లా కలెక్ట‌ర్ హీరో అల్లు అర్జున్‌కి ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. ఇప్పుడా పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది..

3. బాలయ్య కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా.

ఇప్పటికే వీరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య.. తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకంటే ముందే ఓ సర్ ప్రైజింగ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతుంది. ఇంకా చెబితే దర్శకుడిని కనీసం ఊహించలేరు కూడా. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటీ.. డైరెక్టర్ ఎవరు చూద్దాం.

నందమూరి బాలకృష్ణ దూకుడు టాలీవుడ్ షాక్ అవుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఆహా ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అంటూ అందరి థింకింగ్ ను మార్చేస్తున్నాడు. సీనియర్స్ అయినా.. కుర్రాళ్లైనా.. తనదైన వాక్చాతుర్యంతో కుమ్మేస్తున్నాడు. ప్రస్తుతం సెకండ్ సీజన్ జరుగుతోన్న ఈ షో ద్వారానే అతనికి అల్లు అరవింద్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో తన ప్రొడక్షన్ లో బాలయ్యతో సినిమా ఉందని అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్‌ మహా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

కేరాఫ్ కంచరపాలెం మూవీతో విమర్శకులను కూడా మెస్మరైజ్ చేసిన వెంకటేష్‌ మహా ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో ఆకట్టుకున్నాడు. అతను చెప్పిన కథకు బాలయ్య ఓకే అనేశాడట. బాలయ్య ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాల్లో కనిపించలేదు. అదే మూవీకి బిగ్ హైలెట్ అవుతుందట. విశేషం ఏంటంటే.. కేవలం 30 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటేష్‌ మహాకు ఈ ఛాన్స్ రావడమే విశేషం. మరి ఈ కాంబినేషన్ ఆడియన్స్ కు ఎలాంటి థ్రిల్స్ ఇస్తుందో చూడాలి.

4. యంగ్ హీరో రామ్ చివరిగా ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ 20వ చిత్రమిది (RAPO20). ఇందులో రామ్ కి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ది వారియర్’ తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథను ముందుగా బన్నీకి వినిపించారట దర్శకుడు బోయపాటి.

అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్న బోయపాటి ఈ కథనే వినిపించారట. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తరువాత ‘సరైనోడు’ కథ చెప్పారట. బన్నీకి ‘సరైనోడు’ నచ్చడంతో దానికే ఓటేశారు. దీంతో బోయపాటి మొదట రాసుకున్న కథ అలా పక్కకు వెళ్లిపోయింది.

ఇప్పుడు అదే కథను రామ్ కి చెప్పి మెప్పించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇలా ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేయడం కామన్. ఇప్పుడు బన్నీ కోసం అనుకున్న కథతో రామ్ సినిమా చేస్తున్నారంతే. అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh