నడవలేని స్థితిలో బిగ్‌బాస్ బ్యూటీ కారణం ఇదే ?

Is this the reason why The Bigg Boss beauty is unable to walk?

Ashu Reddy: నడవలేని స్థితిలో బిగ్‌బాస్ బ్యూటీ కారణం ఇదే ?

సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ షోతో సెల‌బ్రిటీగా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ 3తో పాటు బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో సంద‌డి చేసింది అషూ రెడ్డి. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అషు రెడ్డి తన మార్కును చూపించింది. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా వ్యవహరించింది. ఇలా చాలా రోజుల పాటు షోలో సందడి చేసింది. దీంతో ఆమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఫినాలేకు రెండు వారాల ముందే షో నుంచి ఎలిమినేట్ అవడంతో షాక్‌ తగిలినట్లైంది.

అయితే సోషల్ మీడియాలో అషు రెడ్డి సుదీర్ఘ కాలంగా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందనే చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో అషూ రెడ్డి చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూ ఆమెను సోషల్‌ మీడియాలో బాగా ప్రోజెక్ట్‌ చేసింది. నిజం చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యన ఎక్కువగా విదేశీ టూర్లలో బాగా కనిపిస్తోంది అషూ రెడ్డి. ఇటీవలే దుబాయ్‌, అమెరికా వెకేషన్స్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇలా నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేసే అషూ రెడ్డి తాజా పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీనిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆస్పత్రిలో ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం టూర్లు, వెకేషన్లతో ఎంతో చలాకీగా ఉండే అషూ రెడ్డి ఆస్పత్రిలో చేరింది. చేతికి సెలైన్‌ పైప్‌తో, ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్న అషూ రెడ్డి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజనులు.. ‘అషూ రెడ్డికి ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకు చేరింది? ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? కంగారూ పడ్డారు, దీనిపై స్పందించిన అషూ తాను ఇప్పుడు త్వరగా కోలుకుంటున్నాను కంగారూ ఏమి లేదు అని చెప్పుకొచ్చింది అషూ రెడ్డి అయితే సమస్యమేంటో మాత్రం తెలపలేదు. ఇదిలా ఉంటే టీవీ షోలతో పాటు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఫోకస్ అనే లో నటించిన అషూరెడ్డి మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించనుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh